Telugu Global
Andhra Pradesh

పంట పొలాలు తగులబెట్టించిన దగుల్బాజీ చంద్రబాబు

తాను అమరావతి పంట పొలాలను తగులబెట్టించానని అంటున్న చంద్రబాబు.. ఎస్సీలపై నిందలేయడం మానేసి, నార్కో టెస్టుకు సిద్ధమా అని ఎంపీ నందిగం సురేష్‌ ప్రశ్నించారు.

పంట పొలాలు తగులబెట్టించిన దగుల్బాజీ చంద్రబాబు
X

చంద్రబాబు ఓ డర్టీ పొలిటీషియన్‌ అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ విమర్శించారు. అమరావతిని కుల రాజధానిగా మార్చింది చంద్రబాబేనని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని పేరిట భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యాలు చేయడమే కాకుండా, అప్పట్లో పంట పొలాలను కూడా తగులబెట్టించిన దగుల్బాజీ చంద్రబాబే అని చెప్పారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ సురేష్‌ మాట్లాడారు.

నార్కో టెస్కుకు సిద్ధమా బాబూ..

తాను అమరావతి పంట పొలాలను తగులబెట్టించానని అంటున్న చంద్రబాబు.. ఎస్సీలపై నిందలేయడం మానేసి, నార్కో టెస్టుకు సిద్ధమా అని ఎంపీ నందిగం సురేష్‌ ప్రశ్నించారు. టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌ కలిసి ఆనాడు పోలీసుల చేత పొలాలకు నిప్పు పెట్టించింది నిజం కాదా అని ఆయన నిలదీశారు. అమరావతి భూముల కుంభకోణంపై తనతో చర్చకొచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్‌ చేశారు. పర్చూరులో బాబు మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, తండ్రీ కొడుకులిద్దరినీ మడతేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.

అంత శక్తి ఉంటే.. పవన్‌ కాళ్లెందుకు పట్టుకుంటున్నారు?

టీడీపీ అంత శక్తివంతమైనదైతే సొంతంగా పోటీ చేయకుండా పవన్‌ కళ్యాణ్‌ కాళ్లు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారని ఎంపీ నిలదీశారు. రాజకీయంగా శక్తిసామర్థ్యాలు సన్నగిల్లిపోయాయని బాబు ఒప్పుకోవాలని ఆయన చెప్పారు. రోగాల పేరు చెప్పి, పదిమంది షూరిటీ ఉండి, వందమంది లాయర్లు కోర్టుల చుట్టూ పరిగెత్తితే గానీ జైలు నుంచి బయట పడలేకపోయాడన్నారు. అనేక కుంభకోణాల్లో రూ. లక్షల కోట్లు మింగిన దొంగ చంద్రబాబు అని విమర్శించారు. విశాఖ, ఏలూరు సిద్ధం సభలను చూసి చంద్రబాబు వణికిపోయారని, రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్‌కి అందే ప్రజాదరణ చూసినతర్వాత బాబు గుండె ఆగుతుందేమో ఆలోచించుకోవాలని ఆయన హెచ్చరించారు.

First Published:  18 Feb 2024 10:13 AM IST
Next Story