Telugu Global
Andhra Pradesh

లోకేశ్.. దమ్ముంటే చర్చకు రా.. - మిథున్ రెడ్డి సవాల్

లోకేశ్ విమర్శలపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. పుంగనూరు అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎక్కడికైనా, ఏ సమయంలోనైనా చర్చించేందుకు తాను రెడీగా ఉన్నానన్నారు.

లోకేశ్.. దమ్ముంటే చర్చకు రా.. - మిథున్ రెడ్డి సవాల్
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర పేరుతో ఏపీలో హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. పుంగనూరుకు మంత్రి పెద్దిరెడ్డి ఏం చేశారంటూ ప్రశ్నించారు.

లోకేశ్ విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. పుంగనూరు అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎక్కడికైనా, ఏ సమయంలోనైనా చర్చించేందుకు తాను రెడీగా ఉన్నానన్నారు.

'లోకేశ్ పాదయాత్రలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అభివృద్ధిపై చర్చించేందుకు నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. కానీ, టీడీపీ హయాంలో తిరుపతి జిల్లాకు ఏం చేశారో కూడా లోకేశ్ ఆలోచించాలి. స్థాయి మరిచి ఆరోపణలు చేయడం సరికాదు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. పుంగనూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో మా దగ్గర వివరాలు ఉన్నాయి. లోకేశ్ వస్తే కచ్చితంగా చర్చిస్తాం' అంటూ మిథున్ రెడ్డి స‌వాల్ విసిరారు. మరి మిథున్ రెడ్డి సవాల్ ను లోకేశ్ స్వీకరిస్తారా..? ఆయనతో చర్చకు వస్తారా..? అన్నది వేచి చూడాలి.

First Published:  9 March 2023 4:08 PM GMT
Next Story