నేను నేడు రాలేను- సీబీఐకి అవినాష్ లేఖ
సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున నేడు తాను విచారణకు రాలేనని వివరించారు. కొన్ని అత్యవసర పనులు కూడా ఉన్నాయని చెప్పారు.
సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి విముఖత చూపారు. నేటి విచారణకు తాను రాలేనని సీబీఐకి ఆయన లేఖ రాశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నిన్న అవినాష్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు వస్తే అవినాష్ రెడ్డిని ఈసారి తప్పకుండా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నడిచింది. సీబీఐ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇంతలో సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున నేడు తాను విచారణకు రాలేనని వివరించారు. కొన్ని అత్యవసర పనులు కూడా ఉన్నాయని చెప్పారు. వరుసగా కార్యక్రమాలు ఉన్నాయని, కాబట్టి నాలుగు రోజుల తర్వాత విచారణకు వస్తానని అందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో సీబీఐని అవినాష్ రెడ్డి కోరారు. షార్ట్ నోటీసు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారని.. ఈ నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సీబీఐకి లేఖ రాసిన అవినాష్ రెడ్డి తన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లారు. అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.