మీరు పీకాలంటే అధికారం కావాలేమో.. మేం పీకాలంటే ఇప్పుడే..
చంద్రబాబు జీవితమంతా ఆడవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేనన్నారు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి. ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకున్నారు కాబట్టే చంద్రబాబు అనే వాడు ఈరోజు ఒక మగాడిలా తిరుగుతున్నారని.. లేకుంటే అసలు చంద్రబాబు అనే వ్యక్తి ఎవరని ప్రశ్నించారు.
ఏపీ సీఎం జగన్ కుటుంబసభ్యులపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నుంచి గత రెండు రోజులుగా గట్టిగా సమాధానమే వస్తోంది. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. చంద్రబాబు, నారా లోకేష్ చేస్తున్న రాజకీయంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు తరిమితరిమి కొట్టినా టీడీపీ నేతలకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. చివరకు కుటుంబాల్లోని ఆడవారిపై విమర్శలు చేసే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు. వైఎస్ భారతి ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త, విద్యావంతురాలు, కష్టాల్లోనూ ఎలా నిలబడాలో తెలిసిన మహిళ అని ప్రకాశ్ రెడ్డి ప్రశంసించారు. ఆమె గురించి మాట్లాడుతున్న టీడీపీ కొడుకులు ఈ విషయాలను గుర్తించుకోవాలని ఘాటుగా వ్యాఖ్యనించారు.
చంద్రబాబు జీవితమంతా ఆడవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేనన్నారు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి. ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకున్నారు కాబట్టే చంద్రబాబు అనే వాడు ఈరోజు ఒక మగాడిలా తిరుగుతున్నారని.. లేకుంటే అసలు చంద్రబాబు అనే వ్యక్తి ఎవరని ప్రశ్నించారు. ఎవరైనా తండ్రి తరపున వంశం తమదిగా చెప్పుకుంటారని.. నారా లోకేష్ మాత్రం అత్తగారి వంశాన్ని తన వంశంగా చెప్పుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ మనుగడ కోసమే నారా లోకేష్ ఎన్టీఆర్ మనవరాలిని పెళ్లి చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే విమర్శించారు.
ఎవడో రోడ్డునపోయే వాడు తిడితే దాన్ని పట్టుకుని నా భార్యను తిట్టారంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేసుకోవడం ద్వారా భువనేశ్వరిని రోడ్డు మీదకు తెచ్చిన వ్యక్తి చంద్రబాబేనని విమర్శించారు. టీడీపీ వెధవలు కొందరు అధికారంలోకి వస్తే సంగతిచూస్తాం, పీకుతాం అంటూ మాట్లాడుతున్నారని.. కానీ ప్రస్తుతం ప్రభుత్వమే తమదని తాము తలుచుకుంటే టీడీపీ నేతలను పీకేయడం ఎంత సేపు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇంకోసారి వైఎస్ భారతి గురించి టీడీపీ కొడుకులు ఇష్టానుసారం మాట్లాడితే.. ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి కొడుతామని ఎమ్మెల్యే హెచ్చరించారు.