ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకుని వారిని ఆడించుకో.. పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ కు ముగ్గురు పెళ్ళాలు ఉన్నారని, ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకుంటే వారిని ఆడించగలుగుతాడన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు ఇప్పటికే ముగ్గురు పెళ్ళాలు ఉన్నారని.. మరో ఇద్దరిని పెళ్లి చేసుకుని వారిని ఆడించుకోవాలని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ వారాహి యాత్రలో భాగంగా కేంద్రంతో చెప్పి జగన్‌ను ఓ ఆట ఆడిస్తా.. అంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నాయకులు పవన్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ కడపలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు దాటిందని.. కానీ ఈ పదేళ్లలో కనీసం 10 మంది వార్డు మెంబర్లను కూడా గెలిపించుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 151 సీట్లు గెలిచి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు జగన్ అని, ప్రజల హృదయాల్లో ఉండే జగన్ ను బలహీనమైన పవన్ ఏ విధంగా ఆడిస్తాడు? అని రాచమల్లు ప్రశ్నించారు.
నోరు ఉంది కదా.. అని పవన్ కళ్యాణ్ వాగుతున్నాడని, గజరాజు వెళ్తుంటే కుక్క మొరిగినట్లు పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పవన్ గెలిచేది లేదు పెట్టేది లేదని, అతడు కేంద్రంతో కలిసి ఏం ఆటాడిస్తాడని అన్నారు. రాష్ట్రంలో ఎవరికి బలం ఉంటే వారికి కేంద్రం పలుకుతుందని.. రాష్ట్రంలో బలవంతుడు జగనా..? పవనా..? అని ప్రశ్నించారు.
వైసీపీ వచ్చే ఎన్నికల్లో 160 అసెంబ్లీ స్థానాలు, 23 నుంచి 25 వరకు లోక్ సభ స్థానాలు గెలుస్తుందని రాచమల్లు అభిప్రాయపడ్డారు. ఎంపీలు ఎక్కువ గెలిచిన వారికే కేంద్రం విలువ ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఎం జగన్ ను గౌరవిస్తోందన్నారు. జగన్ తలుచుకుంటే ఎవరినైనా ఆటాడిస్తారని, ఎవరో ఆడించే స్థితిలో జగన్ లేడు అని అన్నారు.
పవన్‌కు జగన్‌ను ఆడించే సీన్ లేదని రాచమల్లు అన్నారు. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు పెళ్ళాలు ఉన్నారని, ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకుంటే వారిని ఆడించగలుగుతాడన్నారు. పవన్ కళ్యాణ్ ఎంత సేపు ఆడాళ్ళతో ఆడుకోగలడు కానీ మగాళ్లతో ఆడుకునే మనిషి కాదన్నాడు. వైసీపీ ఎమ్మెల్యేలను చెప్పుతో కొడతానని గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడన్నారు. నోరు ఉంది కదా.. అని అడ్డూ అదుపు లేకుండా మాట్లాడే వెధవ పవన్ కళ్యాణ్ అని, జగన్ను మరొకసారి ఏకవచనంతో పిలిస్తే నాలుక కోసి చేతిలో పెడతాం.. అని రాచమల్లు వార్నింగ్ ఇచ్చారు.
వచ్చే దఫా వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించనున్నారు కదా? అని మీడియా ప్రతినిధులు అడుగగా.. పవన్ కాస్త జాగ్రత్తగానే రాయలసీమలో తిరగాల్సి ఉంటుందని రాచమల్లు సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం సృష్టిస్తున్నాయి.