Telugu Global
Andhra Pradesh

అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు.. అందుకేనా..?

టీడీపీకి కొంతమంది పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పోలింగ్ రోజే ఆరోపించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు.. అందుకేనా..?
X

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ విషయం ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. గన్‌మెన్లను వదిలేసి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పిన్నెల్లి సోదరులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో గన్‌మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

పోలింగ్ రోజుతో పాటు మరుసటి రోజు పల్నాడు జిల్లాలోని మాచర్లతో పాటు పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ప్రధానంగా కారంపూడిలో జరిగిన అల్లర్లలో తమను టార్గెట్ చేసే అవకాశం ఉందన్న సమాచారంతోనే పిన్నెల్లి బ్రదర్స్‌ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

టీడీపీకి కొంతమంది పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పోలింగ్ రోజే ఆరోపించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇక పోలింగ్ తర్వాత చెలరేగిన అల్లర్ల విషయంలోనూ పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని, టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారన్నారు. ప్రస్తుతం మాచర్ల సహా పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది.

First Published:  17 May 2024 4:35 PM IST
Next Story