కోటంరెడ్డితో చంద్రబాబుకు తలనొప్పి మొదలైందా?
కోటంరెడ్డి ప్రకటన టీడీపీలో బాగా కాక రేపుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయటానికి టీడీపీలో నేతలే లేరా అనే చర్చ మొదలైంది. ఒకవైపు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ, మరోవైపు జనసేనతో పొత్తుకు రెడీ అవుతున్న చంద్రబాబు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డికి టికెట్ ఖాయం చేయటం ఏమిటంటూ తమ్ముళ్ళు మండిపోతున్నారు.
తెలుగుదేశం పార్టీలో 2014 ఎన్నికల సీనే రిపీటవుతోందా? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీలో టికెట్లురాని నేతలకు టికెట్లిచ్చి టీడీపీ తరపున పోటీ చేయించాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయినట్లున్నారు. ఇప్పటికే జనసేతో పొత్తుంటుందో లేదో స్పష్టంగా బయటపడలేదు. ఒకసారి జనసేతో పొత్తుకు రెడీ అని చంద్రబాబు బహిరంగంగానే ప్రతిపాదించారు. దానికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వెంటనే ఇద్దరు అధినేతలు కూర్చుని సీట్ల బేరాలు మాట్లాడుకుంటారని అందరు అనుకున్నారు. అయితే విచిత్రంగా చంద్రబాబు నుండి పవన్ ప్రతిపాదనకు ఎలాంటి సానుకూలత కనబడలేదు. ఇప్పటికే జనసేనతో పొత్తుంటే సీట్లు కోల్పోయే తమ్ముళ్ళ పరిస్ధితి ఏమిటనే విషయం పార్టీలో గందరగోళంగా తయారైంది. ఈ సమస్య ఇలా ఉండగానే కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నుండి తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేసుకున్నారు. 2014లో కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన చాలా మందికి చంద్రబాబు టికెట్లిచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కోటంరెడ్డి ప్రకటన టీడీపీలో బాగా కాక రేపుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయటానికి టీడీపీలో నేతలే లేరా అనే చర్చ మొదలైంది. ఒకవైపు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ, మరోవైపు జనసేనతో పొత్తుకు రెడీ అవుతున్న చంద్రబాబు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డికి టికెట్ ఖాయం చేయటం ఏమిటంటూ తమ్ముళ్ళు మండిపోతున్నారు. వైసీపీలో నుండి టీడీపీలోకి వస్తే టికెట్ గ్యారెంటీ అనే హామీ చంద్రబాబు ఇవ్వబట్టే కదా కోటంరెడ్డి అంత ధైర్యంగా టీడీపీ నుండి పోటీచేయబోతున్నట్లు ప్రకటించుకున్నారని తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు.
తమను ఇన్‌చార్జిలుగా ప్రకటించమంటే ప్రకటించకుండా నెలల తరబడి నాన్చుతున్న చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలకి మాత్రం టికెట్ గ్యారెంటీ ఇస్తుండటంపై మండిపడుతున్నారు. కోటంరెడ్డి వ్యవహారం చూసిన తర్వాత వెంకటగిరిలో కూడా ఆనం రామనారాయణరెడ్డికి చంద్రబాబు టికెట్ హామీ ఇచ్చే ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హామీలు చంద్రబాబు ఇంకెంతమందికి ఇచ్చారో తెలియక తమ్ముళ్ళలో అయోమయం పెరిగిపోతోంది. మొత్తానికి కోటంరెడ్డి సెల్ఫ్ డిక్లరేషన్ చంద్రబాబుకు కొత్త తలనొప్పిగా మారింది.