శిష్యులు సీఎం అవుతున్నారని.. బాబు వెక్కివెక్కి ఏడుస్తున్నాడు
తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీచేస్తే జనసేన పరిస్థితి ఏమైందో మనం చూశామని, ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీచేస్తే.. తెలంగాణ మాదిరిగానే అవుతుందని కొడాలి నాని స్పష్టంచేశారు.
చంద్రబాబుపై మరోసారి సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తన శిష్యులు సీఎంలు అవుతున్నారని చంద్రబాబు వెక్కివెక్కి ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే కదా, ఒక శిష్యుడు దిగిపోయి మరొక శిష్యుడు పదవిలోకి వచ్చాడని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని.. కానీ, రేవంత్‌రెడ్డిని వీళ్లే ముఖ్యమంత్రిని చేసినట్టు ఫీలవుతున్నారని ఆయన తెలిపారు. సిగ్గులేకుండా గాంధీభవన్‌లో టీడీపీ జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్, ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే పట్టించుకున్నాడని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యతిరేకత ఉంటుందా..? లేదా చంద్రబాబు దొంగ, 420 అయినందుకు బాబుపై అనుకూలత ఉంటుందా..? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రావడం పగటికల అని స్పష్టంచేశారు.
తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీచేస్తే జనసేన పరిస్థితి ఏమైందో మనం చూశామని, ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీచేస్తే.. తెలంగాణ మాదిరిగానే అవుతుందని కొడాలి నాని స్పష్టంచేశారు. ప్రతిపక్షం కోసమే చంద్రబాబు.. అసెంబ్లీలో అధ్యక్షా అనడం కోసం పవన్ కళ్యాణ్.. ఇద్దరూ కలిసి పొత్తుపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. గుడివాడ వైసీపీకి కంచుకోట అని, తాను బతికుండగా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ జెండా దించడం ఎవరివల్లా కాదని ఆయన స్పష్టం చేశారు.