టీడీపీకి 100 సీట్లు రావాలంటే ఐదు సార్లు పోటీ చేయాలి- కాసు మహేష్
వంద సీట్లు టీడీపీకి వస్తాయని యరపతినేని పగటి కలలు కంటున్నారని.. టీడీపీకి 20 సీట్లు మాత్రమే వస్తాయని.. అలా నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 20 సీట్ల చొప్పున అప్పుడు టీడీపీకి 100 సీట్లు అవుతాయని ఎద్దేవా చేశారు.
టీడీపీతో పెట్టుకుని వైఎస్ పావురాల గుట్టలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు.. మళ్లీ మరొకరికి కూడా జరగొచ్చు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. యరపతినేని కొవ్కెక్కి బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
వైఎస్ పాలన ఎలా ఉండేదో అందరం చూశామన్నారు. 2009లో టీఆర్‌ఎస్, కమ్యూనిస్టులను కలుపుకుని వచ్చినా టీడీపీని వైఎస్ చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. దురదృష్టం కొద్ది దేవుడు తీసుకెళ్లాడన్నారు. చంద్రబాబు మాత్రం బాంబు దాడిలో కూడా బతికారని యరపతినేని చెబుతున్నారని.. రాష్ట్రం దురదృష్టం కొద్దీ చంద్రబాబు బతికితే దానికి తామేం చేస్తామన్నారు. మంచివాళ్లను దేవుడు తొందరగా తీసుకెళ్తాడని.. పనికిమాలిన వారిని వదిలేస్తుంటారని మహేష్ వ్యాఖ్యానించారు.
అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్లను ఉరికించి కొడుతామని యరపతినేని చెబుతున్నారని.. గురజాల నుంచి గుంటూరు పారిపోయిన వ్యక్తా వార్నింగ్‌లు ఇచ్చేది అని ఎద్దేవా చేశారు. వంద సీట్లు టీడీపీకి వస్తాయని యరపతినేని పగటి కలలు కంటున్నారని.. టీడీపీకి 20 సీట్లు మాత్రమే వస్తాయని.. అలా ఐదు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 20 సీట్ల చొప్పున అప్పుడు టీడీపీకి 100 సీట్లు అవుతాయని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు గనులను దోపిడీ చేయడం తప్ప యరపతినేని ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.