పవన్ ఓ రాజకీయ వ్యభిచారి.. - ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్
ఎవరిని ఉద్ధరించడానికి జనసేన పార్టీ పెట్టావ్ అంటూ ఈ సందర్భంగా ద్వారంపూడి పవన్‌ను నిలదీశారు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి అని, చంద్రబాబుతో బేరం కుదరకే ఇప్పుడు రోడ్డుపైకి వచ్చాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు గట్టి కౌంటర్ పడింది. అది ఎవరి నుంచో కాదు.. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నుంచే. తనపై చేసిన తీవ్ర విమర్శలకు ద్వారంపూడి ఘాటుగా రియాక్టయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి అని దుయ్యబట్టారు. పార్టీ పెట్టినప్పుడు నీతో ఉన్నవారు ఇప్పుడు ఏమయ్యారు..? నీతో ఉన్నారా..? అని పవన్‌ను నిలదీశారు.
పవన్ తనపై చేసిన అసత్య ఆరోపణలను నిరూపించాలని ఈ సందర్భంగా ద్వారంపూడి డిమాండ్ చేశారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తాము రౌడీలమైతే తమను జనం ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. `నువ్వు రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయావ్. నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు. నన్ను ఓడించడం నీ వల్ల కాదు` అని అన్నారు.
ఎవరిని ఉద్ధరించడానికి జనసేన పార్టీ పెట్టావ్ అంటూ ఈ సందర్భంగా ద్వారంపూడి పవన్‌ను నిలదీశారు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి అని, చంద్రబాబుతో బేరం కుదరకే ఇప్పుడు రోడ్డుపైకి వచ్చాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావడం పవన్‌కు సాధ్యం కాదని ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తేల్చేశారు. కావాలనుకుంటే అది సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.