వంద ఫిర్యాదులు చేసినా రిజల్ట్ మారదు.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్
వాలంటీర్లు, ఐపీఎస్ అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా దొంగ దెబ్బ కొడుతున్నానని చంద్రబాబు భ్రమ పడుతున్నారేమో అన్న విజయసాయిరెడ్డి.. ప్రజలు కొట్టబోయే దెబ్బకు చంద్రబాబుకు దిమ్మ తిరగడం ఖాయం అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నిమ్మగడ్డ రమేష్‌తో వాలంటీర్లపై విషం చిమ్మింది.. వదిన పురందేశ్వరితో 22 మంది ఐపీఎస్‌లపై ఫిర్యాదు చేయించింది చంద్రబాబేనన్నారు విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
వాలంటీర్లు, ఐపీఎస్ అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా దొంగ దెబ్బ కొడుతున్నానని చంద్రబాబు భ్రమ పడుతున్నారేమో అన్న విజయసాయిరెడ్డి.. ప్రజలు కొట్టబోయే దెబ్బకు చంద్రబాబుకు దిమ్మ తిరగడం ఖాయం అన్నారు.
మీ న”మ్మక”స్తుడు నిమ్మగడ్డ రమేశ్‌తో వలంటీర్లపై విషం చిమ్మించావు. వదిన పురంధేశ్వరితో 22 మంది ఐపీఎస్‌లపై ఫిర్యాదు చేయించింది మీరే కదా చంద్రబాబు గారూ. వాళ్లంతా ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు. వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతీసేలా దొంగ దెబ్బ కొడుతున్నా అనుకుంటున్నారేమో. ప్రజలు కొట్టబోయే…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 5, 2024
బాబుకు ఇవే ఆఖరి ఎలక్షన్లని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఇంకో వంద ఫిర్యాదులు చేయించినా ఫైనల్ రిజల్ట్ మారదన్నారు విజయసాయి రెడ్డి. తీర్పు చెప్పాల్సిన ప్రజలు జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు.