ఇంకెంత మంది ఉసురుపోసుకుంటావు.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెంత మంది అమాయకుల ఉసురుపోసుకుంటావు అంటూ చంద్రబాబును నిలదీశారు విజయసాయిరెడ్డి.
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మరోసారి మండిపడ్డారు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ అందకుండా చేసి 40 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడంటూ ఫైర్ అయ్యారు. చావు డప్పుల మోత వింటే చంద్రబాబుకు ఉల్లాసంగా ఉంటుందంటూ ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి.
చంద్రబాబు గత చరిత్రను గుర్తుచేశారు. 2000 సంవత్సరంలో ఆగస్టు 28న కరెంటు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపిన రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదన్నారు విజయసాయిరెడ్డి. రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా 30 మంది ప్రాణాలను బలి తీసుకుని మరణమృదంగం మోగించాడన్నారు.
ఇళ్ల దగ్గర పింఛన్లు అందకుండా చేసి 40 మంది వృద్ధుల ప్రాణాలు తీసిన నరహంతకుడు చంద్రబాబు. చావు డప్పుల మోత వినిపిస్తుంటే ఆయన ఉల్లాసంగా కనిపిస్తాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 6, 2024
2/3: బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన ఘటన నుంచి, రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది ప్రాణాలు బలిగొని మరణ మృదంగం మోగించాడు.
3/3:…
కందుకూరులో ఇరుకు వీధిలో సభ పెట్టి 8 మంది ఉసురు తీసిన విషయం నెల్లూరు జిల్లా ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెంత మంది అమాయకుల ఉసురుపోసుకుంటావు అంటూ చంద్రబాబును నిలదీశారు విజయసాయి.