వైఎస్ షర్మిలకు వాసిరెడ్డి పద్మ కౌంటర్
షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మండిపడ్డారు. సీఎం జగన్‌ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
షర్మిల తన బుర్రలో ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ. చంద్రబాబు తన రాజకీయంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. హంతకుడు అంటూ వైఎస్ అవినాష్‌రెడ్డిపై షర్మిల నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిలకు కోర్టుల మీద, వ్యవస్థల మీద నమ్మకం లేదా అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యలో జరుగుతున్న రాజకీయాల్ని కడప ప్రజలు గమనిస్తున్నారన్నారు వాసిరెడ్డి పద్మ.
షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మండిపడ్డారు. సీఎం జగన్‌ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషిగా మిగిలిందని, ఏపీ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఎజెండాతో వైఎస్ జగన్‌పై నిందలు వేస్తున్నారన్న వాసిరెడ్డి పద్మ.. తమ ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
"ఏం సాధించడానికి షర్మిల ఈ ఎన్నికల్లో పోటీచేస్తోంది? రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్. రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్. విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా?. ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు?. ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది" అన్నారు వాసిరెడ్డి పద్మ.