అమిత్ షాతో భేటీ కోసం బాబు పైరవీ.. ఆ పత్రికాధినేతతో బేరసారాలు: సజ్జల
బీజేపీతో పొత్తు కోసం, ప్రాపకం కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని.. డబ్బా పత్రికల్లో ప్రచారం చేయించుకుంటున్నారని అన్నారు. ‘అమిత్ షా తో భేటీ కోసం చంద్రబాబు దిగజారిపోయాడు. గతాన్ని మరిచిపోయి బీజేపీ ప్రాపకం కోసం తాపత్రయపడుతున్నాడు.
ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈనాడు పత్రికాధినేత రామోజీ రావు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వార్తలు, ఊహాగానాలు ఇంకా చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడంత నీచుడు ప్రపంచంలోనే లేరని వ్యాఖ్యానించారు. సొంత పత్రికలను అడ్డుపెట్టుకొని తప్పుడు రాతలు రాయిస్తున్నారని వాపోయారు.
బీజేపీతో పొత్తు కోసం, ప్రాపకం కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని.. డబ్బా పత్రికల్లో ప్రచారం చేయించుకుంటున్నారని అన్నారు. 'అమిత్ షా తో భేటీ కోసం చంద్రబాబు దిగజారిపోయాడు. గతాన్ని మరిచిపోయి బీజేపీ ప్రాపకం కోసం తాపత్రయపడుతున్నాడు. అమిత్ షాతో భేటీ అయ్యే చాన్స్ ఇప్పించాలని రామోజీరావును బతిమాలినట్టు తెలిసింది. ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా' అంటూ సజ్జల అన్నారు.
చంద్రబాబు నాయుడు రామోజీరావును, ఈనాడు పత్రికను అడ్డుపెట్టుకొని సీఎం అయ్యారని.. తెలుగుదేశం పార్టీని కబ్జాచేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నవారంతా అక్రమార్కులేనని మండిపడ్డారు. 'చంద్రబాబు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు.. కాబట్టి వారిని పట్టించుకోడు. తనను ఎన్నుకోలేదని ప్రజలకు చంద్రబాబు శాపనార్థాలు పెడుతుంటారు. శుక్రవారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి నవ్వొస్తోంది. వందేళ్ల భారత్‌కు మీ సలహాలు, సూచనలు పంపించాలని చంద్రబాబును మోదీ అడిగారట. అందుకోసం 15 మంది రిటైర్డ్ అధికారులతో కలిసి ఈయన వర్క్ చేస్తున్నారట.' అంటూ సజ్జల విమర్శించారు.