Telugu Global
Andhra Pradesh

అభ్యర్థుల మార్పు.. సజ్జల ఏమన్నారంటే..!

ప్రస్తుతం వైసీపీ టీమ్‌ చాలా అద్భుతంగా ఉందన్నారు సజ్జల. ఇదే టీమ్‌తో ముందుకు వెళ్తామన్నారు. ఎవరో ఏదో రాశారని, నలుగురైదుగురు పార్టీలో చేరారని మార్పులు ఉండబోవన్నారు.

అభ్యర్థుల మార్పు.. సజ్జల ఏమన్నారంటే..!
X

వైసీపీ అభ్యర్థులను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. జగన్‌ రోడ్‌ షోలు, సభలకు వస్తున్న స్పందనను చూడలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల.

ఒకరో, ఇద్దరో పార్టీలో చేరినంత మాత్రాన అభ్యర్థులను మార్చబోమన్నారు సజ్జల. ఇది తెలుగుదేశం పార్టీ కాదన్నారు. దివాళా తీసిన తెలుగుదేశం పార్టీ ఎవరు దొరికితే వారిని పార్టీలోకి తీసుకుని అభ్యర్థులుగా ప్రకటిస్తుందన్నారు. కానీ వైసీపీ ఓ పద్ధతి ప్రకారం నడుస్తుందన్నారు.

ప్రస్తుతం వైసీపీ టీమ్‌ చాలా అద్భుతంగా ఉందన్నారు సజ్జల. ఇదే టీమ్‌తో ముందుకు వెళ్తామన్నారు. ఎవరో ఏదో రాశారని, నలుగురైదుగురు పార్టీలో చేరారని మార్పులు ఉండబోవన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించడం ఖాయమన్నారు.

First Published:  11 April 2024 5:30 PM IST
Next Story