దేశమంతా ఒకలా.. ఏపీలో మరోలా.. ఇదేం న్యాయం - సజ్జల
ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారన్నారని సజ్జల ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో దేశమంతా ఒక రూల్.. ఏపీలో మరో రూల్ ఏంటని ప్రశ్నించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. ఎన్నికల కమిషన్ తన నిర్ణయాలను తనే ఉల్లంఘిస్తే ఎలా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన తప్పు.. తప్పు కాకుండా పోతుందా అని నిలదీశారు సజ్జల. కేవలం ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్‌పై ప్రత్యేక వెసులుబాటు కల్పించడంపై అనుమానాలు లేవనెత్తారు.
ఇక ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారన్నారని సజ్జల ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలు ఫాలో అవకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో తెలుగుదేశం నేతలు ఉన్నారన్నారు. చంద్రబాబు తన కుటిల బుద్ధిని బయట పెట్టుకున్నారన్నారు. బీజేపీ జాతీయ వ్యూహాలను ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ చాలా బలమైన పార్టీ అన్న సజ్జల.. రెచ్చగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో.. అధికారంలోకి వచ్చాక అంతే బాధ్యతాయుతంగా ఉన్నామని చెప్పారు సజ్జల. పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు ఫుల్ పిక్చర్ అర్థమయిందన్నారు సజ్జల. 21 సీట్లలో పోటీ చేసిన జనసేనకు 7 శాతం ఓటింగ్ ఎలా సాధ్యమన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. నార్త్‌లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. అందుకే సౌత్‌లో సీట్లు వస్తున్నాయని చూపించుకుంటోందన్నారు. వైసీపీ జనంతోనే ఉందని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.