Telugu Global
Andhra Pradesh

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు అప్పుడే.. స‌జ్జ‌ల క్లారిటీ

బీసీల ఐక్యత -సమగ్ర అభివృద్ధిపై బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సజ్జల ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు అప్పుడే.. స‌జ్జ‌ల క్లారిటీ
X

లోక్‌స‌భ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బీసీల ఐక్యత -సమగ్ర అభివృద్ధిపై బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సజ్జల ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. లోక్‌స‌భ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పారు.

సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కులవృత్తులు కూడా మారుతున్నాయని చెప్పిన సజ్జల.. కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి సరి పెట్టుకోమంటున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలా..? లేకపోతే మారుతున్న భవిష్యత్తు వైపు అడుగులు వేయిస్తున్న జగన్ కావాలా..? అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తుంటారని సజ్జల విమర్శించారు. 2014 -19 మధ్యలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని నమ్మితేనే ఓట్లు వేయమని చెప్పే నాయకుడు జగన్ మాత్రమే అని అన్నారు.

ఎన్నికల సమయంలో చిల్లర వేసే నాయకులు కావాలా..? నిత్యం చేయూత అందించే వారు కావాలా..? అని సజ్జల ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధంగా ఉంద‌న్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తాము లెక్కలోకి తీసుకోవడం లేదని ఆయన చెప్పారు.

First Published:  29 Nov 2023 12:37 PM GMT
Next Story