పక్కా ప్లాన్‌తోనే రామకృష్ణారెడ్డి హత్య, సోషల్ మీడియాలో ఆడియోలు
హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న వరుణ్‌కు ఎమ్మెల్సీ పీఏకు మధ్య ఒక సంభాషణ నడిచింది. మీరేం చేసినా సహాయం చేస్తానంటూ సీఐ జీటీ నాయుడు హామీ ఇచ్చినట్టు నిందితుల మధ్య మాటలు నడిచాయి.
హిందూపురం వైసీపీ మాజీ ఇన్‌చార్జ్ రామకృష్ణారెడ్డి హత్య పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టు స్పష్టమవుతోంది. తాజాగా హత్యకు ముందు నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో అవి ప్రత్యక్షమయ్యాయి. కొందరు వైసీపీ స్థానిక నేతలు ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపికృష్ణకు ఫోన్ చేసి `రామకృష్ణారెడ్డి ఏం అన్యాయం చేశారని అలా హత్య చేశారు` అంటూ నిలదీసిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న వరుణ్‌కు ఎమ్మెల్సీ పీఏకు మధ్య ఒక సంభాషణ నడిచింది. మీరేం చేసినా సహాయం చేస్తానంటూ సీఐ జీటీ నాయుడు హామీ ఇచ్చినట్టు నిందితుల మధ్య మాటలు నడిచాయి. హత్య తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఇక్బాల్ సార్ చూసుకుంటే చాలంటూ నిందితుల్లో ఒకరు మాట్లాడారు.
``ఎమ్మెల్సీ ఇక్బాల్ సర్.. సీఎం జగన్‌కు చాలా సన్నిహితంగా ఉంటారు.. పోలీసులు కూడా ఇక్బాల్ సర్ చెప్పినట్టే వింటారు. కాబట్టి హత్య చేసినా ఎవరూ ఏమీ చేయలేరు`` అన్నట్టుగా నిందితుల మధ్య సంభాషణ నడిచింది. ఈ ఆడియోల నేపథ్యంలో రామకృష్ణారెడ్డిది ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు పక్కా రాజకీయ కోణంలో జరిగిన హత్యేనన్న భావన వ్యక్తమవుతోంది. సొంత పార్టీ వారే ఆయన్ను చంపేసినట్టు భావించాల్సి వస్తోంది.