నీ బిల్డప్ ఏందయ్యా!. దొర్లుకుంటూ వద్దువు.. ముందు కొవ్వు కరిగించు..
విజయవాడ టీడీపీ టికెట్ కేశినేని నాని సోదరుడు చిన్నికి దాదాపు ఖరారైంది. దాంతో కేశినేని నాని వైసీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. వైసీపీ నేతల ప్రకటనలు అదే తరహాలో ఉన్నాయి.
విజయవాడ ఎంపీ కేశినేని నానికి, టీడీపీ నాయకత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నిన్ననే టీడీపీ నాయకత్వంపై నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటూ మాట్లాడారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటూ ప్రకటించారు. పార్టీ ఏమనుకున్నా తనకు అభ్యంతరం లేదంటూ వైసీపీ నేతలతో ఆయన ఈ మధ్య కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఇలా పదేపదే కేశినేని నాని వార్తల్లో నిలుస్తుండడంతో .. గత ఎన్నికల్లో వైసీపీ తరపు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేశినేని నాని చేతిలో 8వేల 726 ఓట్ల తేడాతో ఓడిపోయిన పీవీపీ ఒక ట్వీట్ చేశారు.
నీ బిల్డప్ ఏందయ్యా అంటూ కేశినేనిని ప్రశ్నించారు. ''నీ బిల్డప్ ఏందయ్యా @kesineni_nani.నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు..ప్రజాసేవ కోసం పుట్టానంటావు. కానీ, దొబ్బెది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి, కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు!!'' అంటూ ట్వీట్ చేశారు.
నీ బిల్డప్ ఏందయ్యా @kesineni_nani
— PVP (@PrasadVPotluri) June 1, 2023
నువ్వేదో అల్లూరి కి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు..
ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని,జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి,కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు..…
విజయవాడ టీడీపీ టికెట్ కేశినేని నాని సోదరుడు చిన్నికి దాదాపు ఖరారైంది. దాంతో కేశినేని నాని వైసీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. వైసీపీ నేతల ప్రకటనలు అదే తరహాలో ఉన్నాయి. నాని ఎక్కువగా ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతోనే కనిపిస్తున్నారు. దాంతో కేశినేని నాని వైసీపీలోకి రావడం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా దూరంగా ఉంటున్న పీవీపీకి నచ్చడం లేదేమో... అందుకే ఈ తరహా ట్వీట్ చేసి ఉంటారన్న చర్చ నడుస్తోంది.