రేవంత్‌కి ఎందుకు ఫోన్ చేయాలి? ఎందుకు కలవాలి?
కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు రేవంత్‌రెడ్డి మద్దతివ్వడంపై స్పందిస్తూ అందులో వింతేముందని ఆయన ప్రశ్నించారు. అసలు రేవంత్‌రెడ్డి గురించి ఏపీలో చర్చించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎందుకు ఫోన్ చేయాలి.. ఎందుకు కలవాలని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తనను కనీసం ఫోన్ చేసి అభినందించలేదని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా, రేవంత్‌రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో ఆయన్ని అభినందించారని కొడాలి నాని గుర్తుచేశారు. ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్క విధంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఫోన్ చేసి అభినందించాల్సిన పని ఏముందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కి తుంటి విరిగింది కాబట్టి సీఎం జగన్ ఆయన్ని పరామర్శించేందుకు వెళ్లారని ఆయన తెలిపారు.
రేవంత్ గురించి చర్చించాల్సిన అవసరం లేదు..
పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికలతో తమకు సంబంధమేమిటని కొడాలి నాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా తమకు సంబంధం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు రేవంత్‌రెడ్డి మద్దతివ్వడంపై స్పందిస్తూ అందులో వింతేముందని ఆయన ప్రశ్నించారు. అసలు రేవంత్‌రెడ్డి గురించి ఏపీలో చర్చించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.
బాబు టికెట్లు అమ్ముకుంటున్నాడు..
చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నాడని కొడాలి నాని విమర్శించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కేశినేని నానిని మోసం చేసి.. రూ.150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మాడని మండిపడ్డారు. గుడివాడలో కూడా రూ.100 కోట్లు ఇచ్చిన అతనికి సీటు ఇచ్చాడని ధ్వజమెత్తారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకున్నాడని విమర్శించారు.