Telugu Global
Andhra Pradesh

భారీ వడ్డీ బాబు హయాంలోనే- ఆర్‌బీఐ రిపోర్టు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019-20 ఆర్థిక ఏడాదిలో 7.2 శాతానికి, 2020-21లో కేవలం 6.5 శాతం వడ్డీకే రుణాలు సేకరించిందని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది.

భారీ వడ్డీ బాబు హయాంలోనే- ఆర్‌బీఐ రిపోర్టు
X

జగన్ ప్రభుత్వం భారీగా అప్పులు తెస్తోంది.. అది కూడా భారీ వడ్డీకి తెస్తోందంటూ టీడీపీ ఇటీవల విమర్శలు చేస్తోంది. అయితే ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక మాత్రం చంద్రబాబు హయాంలోనే భారీ వడ్డీలకు అప్పులు తెచ్చినట్టు స్పష్టం చేసింది. గతంలో పోలిస్తే ఇప్పటి ప్రభుత్వ అప్పుల వడ్డీనే తక్కువగా ఉందని నిర్ధారించింది. తెస్తున్న అప్పు కూడా గతంతో పోలిస్తే తక్కువగానే ఉందని నివేదిక ఇచ్చింది.

చంద్రబాబు ప్రభుత్వం 2016-17, 2017-18 సంవత్సరాల్లో సరాసరి 7.6 శాతం వడ్డీకి రుణాలు తెచ్చింది. 2018-19లో ఏకంగా 8.3 శాతం వడ్డీతో అప్పులు తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019-20 ఆర్థిక ఏడాదిలో 7.2 శాతానికి, 2020-21లో కేవలం 6.5 శాతం వడ్డీకే రుణాలు సేకరించిందని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని కూడా చంద్రబాబు ఐదేళ్ల పాటు దాటేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మూడు శాతం కాగా.. చంద్రబాబు హయాంలో ఒక ఏడాది ఏకంగా ఆరు శాతం దాటేసింది. మిగిలిన నాలుగేళ్లు .. 4శాతం పైనే ద్రవ్యలోటు ఉందని ఆర్‌బీఐ వెల్లడించింది.

రోజూ అప్పులు అంటూ గగ్గోలు పెడుతున్న టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా.. తాజాగా ఆర్‌బీఐ ఇచ్చిన రిపోర్టులో ఏం సమాధానం చెబుతుందని వైసీపీ ప్రశ్నిస్తోంది.

First Published:  24 July 2022 7:23 AM IST
Next Story