Telugu Global
Andhra Pradesh

ఎట్టకేలకు ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు.. జాబితా ప్రకటించిన వైసీపీ

ఈ 18 మందిలో బీసీలు 11 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీలు నలుగురు ఉన్నారు. దీనివల్ల జూలై తరువాత శాసనమండలిలో వైసీపీ తరఫున మొత్తం బీసీ ప్రతినిధులు 19 మంది ఉంటారని సజ్జల చెప్పారు

ఎట్టకేలకు ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు.. జాబితా ప్రకటించిన వైసీపీ
X

వైసీపీ తన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేశారు. మొత్తం 18 మంది అభ్యర్థుల పేర్లను ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాలకు, స్థానిక సంస్థల కోటాలో 9 మంది అభ్యర్థులను, గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించారు.

ఈ 18 మందిలో బీసీలు 11 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీలు నలుగురు ఉన్నారు. దీనివల్ల జూలై తరువాత శాసనమండలిలో వైసీపీ తరఫున మొత్తం బీసీ ప్రతినిధులు 19 మంది ఉంటారని సజ్జల చెప్పారు. ఆరుగురు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, మైనార్టీలు నలుగురు చొప్పున శాసనమండలిలో వైసీపీ తరఫున ప్రాతినిధ్యం ఉంటుందన్నారు.

స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు..

1. నత్తు రామారావు - యాదవ్- శ్రీకాకుళం

2. కుడుపూడి సూర్యనారాయణ - శెట్టి బలిజ - తూర్పుగోదావరి జిల్లా

3. సిపాయి సుబ్రమణ్యం- చిత్తూరు

4. రామసుబ్బారెడ్డి- కడప

5. మధుసూదన్- బోయ - కర్నూల్

6. ఎస్ మంగమ్మ- బోయ - అనంతపురం

7. కవురు శ్రీనివాస్ - శెట్టిబలిజ -పశ్చిమగోదావరి

8. మేరుగ మురళి- ఎస్సీ మాల - నెల్లూరు

9. వంక రవీంద్రనాథ్ - ఓసీ - కాపు

ఎమ్మెల్యే కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు..

1. ఏసురత్నం- వడ్డెర- గుంటూరు

2. మరి రాజశేఖర్- కమ్మ - గుంటూరు

3. పోతుల సునీత -పద్మశాలి -ప్రకాశం

4. బొమ్మి ఇజ్రాయిల్ -ఎస్సీ మాదిగ - తూర్పుగోదావరి

5. కోలా గురువులు- విశాఖ

6. జయ మంగళ వెంకటరమణ- పశ్చిమగోదావరి

7. పెనుమత్స సూర్యనారాయణ - ఓసి

గవర్నర్ కోటాలో అభ్యర్థులు

1. కంభా రవిబాబు - ఎస్టి- విశాఖ

2. కర్రీ పద్మశ్రీ - కాకినాడ

చాలాకాలంగా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్న మర్రి రాజశేఖర్ కు ఎట్టకేలకు జగన్ అవకాశమిచ్చారు. కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డికి కూడా అవకాశం ఇచ్చారు.

First Published:  20 Feb 2023 10:14 AM GMT
Next Story