పవన్ ''ఆడవాళ్లు మిస్సింగ్'' వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్
ఎన్‌సీఆర్‌బీ డేటాను చూపెడుతున్నారు. 2021లో ఏపీలో 10,085 మంది ఆడవాళ్లు మిస్ అయ్యారు. మగవాళ్లు 4,065 మంది మిస్ అయ్యారు. మహారాష్ట్రలో ఏకంగా 37వేల 278 మంది ఆడవారు మిస్ అయ్యారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 31వేల మంది ఆడవాళ్లు మిస్ అయ్యారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పవన్ కల్యాణ్ వ్యవహారం ఉందని విమర్శిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి గురించి మాట్లాడకుండా కేవలం ఏపీలో మాత్రమే ఆడవాళ్లు మిస్ అవుతున్నట్టు పవన్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఎన్‌సీఆర్‌బీ డేటాను చూపెడుతున్నారు. 2021లో ఏపీలో 10,085 మంది ఆడవాళ్లు మిస్ అయ్యారు. మగవాళ్లు 4,065 మంది మిస్ అయ్యారు. మహారాష్ట్రలో ఏకంగా 37వేల 278 మంది ఆడవారు మిస్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లో ఈ సంఖ్య 35వేల 638. బెంగాల్లో దాదాపు 30వేల మంది. రాజస్థాన్‌లో 20వేల మంది, తమిళనాడు 17,704 మంది. గుజరాత్‌లో 9,812, మంది, కేరళలో 6,183 మంది మిస్ అయ్యారు.
ఇలా చెబుతూ పోతే ఏపీ చాలా రాష్ట్రాల కంటే కూడా బెటర్‌గా ఉంది. గడిచిన ఐదేళ్ల డేటా తీసుకున్నా.. 2016 నుంచి 20 వరకు ఏపీలో 29వేల943 మంది మహిళలు మిస్ అవగా.. గుజరాత్‌లో ఐదేళ్లలో 41వేల 621 మంది మిస్ అయ్యారు. చంద్రబాబు హయాంలోనూ వేల మంది మహిళలు కనిపించకుండాపోయారని మరి అప్పుడెందుకు పవన్ కల్యాణ్ ప్రశ్నించలేదని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. దేశం మొత్తం మీద 2021లో2లక్షల 49వేల 701 మంది ఆడవాళ్లు కనిపించకుండాపోయారు.