వైఎస్ జగన్ ఇక సిద్ధం!
ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఒక్క రాత్రిలోనే అన్ని ప్రధాన హాట్‌స్పాట్‌లు లేదా ముఖ్య కూడళ్లలో ఒక నిర్దిష్ట పోస్టర్ / హోర్డింగ్ / బిల్‌బోర్డ్‌తో కళకళలాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చర్చనీయాంశాలుగా మారాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తు, దివంగత నేత రాజశేఖర కుటుంబాన్ని చీల్చి, షర్మిలను ముందు నిలబెట్టిన జాతీయ పార్టీ చేస్తున్న కుట్ర వంటివి అంశాలు జోరుగా ఊపందుకున్నాయి. వీటన్నింటి మధ్య, సీఎం జగన్ ఒక కొత్త పదంతో వాటికి సమాధానంగా ముందుకు వస్తున్నారు అదే 'సిద్ధం' (రెడీ). అంటే 2024 ఎన్నికల కోసం వైఎస్ఆర్‌సీపీ రాజకీయ ప్రచారానికి అధికారికంగా నగారా మోగించటానికి సిద్ధమైందనే అర్థం.
ఈ కార్యక్రమ ప్రధాన అంశాలు
ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఒక్క రాత్రిలోనే అన్ని ప్రధాన హాట్‌స్పాట్‌లు లేదా ముఖ్య కూడళ్లలో ఒక నిర్దిష్ట పోస్టర్ / హోర్డింగ్ / బిల్‌బోర్డ్‌తో కళకళలాడుతున్నాయి. ఈ డిజైన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ జెండాతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ముఖాన్ని పొందుపరిచారు. వ్యూహాత్మకంగా జగన్ చిత్రం పక్కన ఉంచారు. వైఎస్ఆర్ కలను ఆయన కుమారుడు జగన్ ముందుకు తీసుకుని వెళ్తున్నదానికి, వైఎస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని చెప్పడానికి ప్రతీకగా ఈ పోస్టర్‌ను రూపొందించారు.
వ్యూహాత్మంగా సిద్ధం అనే పదాన్నే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. గ్లోబల్ ట్రెండ్‌లో పొడవాటి టైటిల్స్ వాడుతున్న తరుణంలో జగన్ వారికి భిన్నంగా సిద్ధం అని ఒక్క మాటతో ముందుకు వచ్చారు. జగన్ తరుచూగా రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధమని అంటుంటారు, ఆ మాటకు జోడింపుగా మేం సిద్ధం అనే సందేశంతోనే ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.
అంతేకాకుండా ఈ పోస్టర్ ఆశ్చర్యార్థకం గుర్తులో పిడికిలిని కూడా చూపిస్తుంది, అది కూడా చాలా చిత్రంగా అనిపిస్తుంది. అందులో చాలా లోతైన అర్థం ఉందని తెలుస్తోంది. తన కార్యకర్తలు ఈ సమావేశాలకు కదిలిరావాలని జగన్ పిలుపునిచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇంక ఎలాంటి సవాళ్లనైనా, పొత్తులనైనా, కుట్రలనైనా ఎదుర్కొనేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. గతంలో ఎక్కడా వాడని, చూడని ప్రయోగమిది.
ఈ పోస్టర్ లో కనిపించే మరో అంశం ఏమిటంటే.. కార్యకర్తలు తమ నాయకుడితోపాటు తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ, చేతులు పైకెత్తడం ద్వారా జగన్ పిలుపునకు ప్రతిస్పందిస్తున్న విధంగా గణనీయమైన సంఖ్యలో వ్యక్తులను కూడా డిజైన్ చూపిస్తుంది! సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ తన ‘స్టార్ క్యాంపెయినర్లు’ అని సంభోదిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. తన కార్యకర్తలకు జగన్ ఇచ్చే ప్రముఖ్యతను చాటి చెప్తున్నారని అర్థమవుతుంది. రాబోయే 75 రోజులకు ఎన్నికల టోన్ ని సెట్ చేయడానికి ఇవన్నీ అద్దినట్లు కనిపిస్తుంది.
రాజకీయనేతగా, ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా చేసిన జగన్ గురించి తెలిసిన వారికి, తాము ఎప్పటినుండో చూసిన జగన్‌కు పూర్తి భిన్నంగా జగన్ (2019కి భిన్నంగా) 2.0 విడుదల చేయబోతున్నారనే విషయాన్ని సూచిస్తుంది. ఈ హోర్డింగ్‌లు ఒక్క రాత్రిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువత ఈ పోస్టర్ ను షేర్ చేస్తోంది.
వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు 'సిద్ధం' పేరుతో నాలుగు అతి భారీ క్యాడర్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది, అందులో మొదటిది జనవరి 27వ తేదీన భీమిలిలో జరగనుంది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల వరకు హాజరు కావచ్చని పార్టీ అంచనా వేస్తోంది. ఇప్పటికే క్యాడర్‌కు సందేశాలు, IVRS, ఆహ్వానాలు పంపించారు. ఈ కార్యక్రమ తాలుక ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా మైదానంలో తమ ఉత్సాహాన్ని పంచుకోవడం ప్రారంభించారు.
‘సిద్ధం’ అంటూ సీఎం జగన్ చేస్తున్న యుద్ధనినాదంపై వైఎస్సార్‌సీపీ క్యాడర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అలాగే దానికి సంబంధించి డిజిటల్, వాట్సాప్ స్పేస్‌లో బాగా ప్రాచుర్యం పొందుతున్న కొన్ని క్రింది విధంగా ఉన్నాయి:-
* టీడీపీ ప్రచార యంత్రాంగాన్ని తలదన్నేలా - సిద్ధం!
* టీడీపీ-జనసేన లేదా మరేదైనా జాతీయ పార్టీల కూటమిపై పోరాడేందుకు - సిద్ధం!
* జగన్ సోదరిని కూడా వదలని కుట్రదారులపై పోరాడేందుకు - సిద్ధం!
* బలవంతులపై జనం కోసం యుద్ధం చేయడానికి - సిద్ధం!
* పేదలపై జరుగుతున్న కుట్రల నుంచి ఏపీని కాపాడేందుకు - సిద్ధం!
* మెరుగైన సంక్షేమ ప్రణాళికను అందించడానికి - సిద్ధం!
* మునుపెన్నడూ చూడని అభివృద్ధిని చూపించటానికి - సిద్దం!