టీడీపీలో యలమంచిలి టికెట్ వార్.. పార్టీ ఆఫీసులో తమ్ముళ్ల రచ్చ
పొత్తులో భాగంగా యలమంచిలి సీటు జనసేనకు కేటాయిస్తారని తెలియడంతో.. పార్టీ ఆఫీసులో హంగామా చేశారు కార్యకర్తలు. కిటికీలు, కుర్చీలు ధ్వంసం చేసి నిరసన తెలిపారు.
తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఓ వైపు పొత్తు ప్రకటనలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాత్రం పార్టీలకు సీరియస్ వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు సొంత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖరారు కావడంతో పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు తెలుగుదేశం కార్యకర్తలు. పొత్తులో భాగంగా యలమంచిలి సీటు జనసేనకు కేటాయిస్తారని తెలియడంతో.. పార్టీ ఆఫీసులో హంగామా చేశారు కార్యకర్తలు. కిటికీలు, కుర్చీలు ధ్వంసం చేసి నిరసన తెలిపారు.
బీజేపీ - జనసేన - టీడీపీ పొత్తుపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2024
యలమంచిలి టికెట్ జనసేనకి ఇస్తున్నట్టు అధిష్ఠానం నుండి ఆదేశాలు రావటంతో ప్రగడ నాగేశ్వరావు అనుచరులు కుర్చీలను ద్వసం చేసి మాకుమ్మడి రాజీనామాకి సిద్దమయ్యారు. pic.twitter.com/iKOr0fQnwu
యలమంచి సీటు జనసేనకు ఇవ్వొద్దంటూ ఆందోళనకు దిగారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. యలమంచిలి టికెట్ టీడీపీ అభ్యర్థికి ఇవ్వకపోతే సహకరించే పరిస్థితే లేదన్నారు. టీడీపీ సీనియర్ నేతలు నేతలు పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.