Telugu Global
Andhra Pradesh

బాబాయ్‌కి ఎర్త్ పెడుతున్న అబ్బాయ్.. వైజాగ్ అల్లుడు నెక్ట్స్ టార్గెట్ అదేనా..?

ఒక‌వేళ కాలం క‌లిసి వ‌చ్చినా సీనియ‌ర్లు ఉన్నారు. వారికి కాద‌ని ప‌ద‌వి ఇచ్చేది లేదు. ఎంపీగా గెలిస్తే వేస్టు... ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఇంట్లో పోరు పెడుతున్నార‌ట‌.

బాబాయ్‌కి ఎర్త్ పెడుతున్న అబ్బాయ్.. వైజాగ్ అల్లుడు నెక్ట్స్ టార్గెట్ అదేనా..?
X

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయంలో ఇప్పుడో ముచ్చ‌ట న‌డుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేస్తారా? లేదా? ఈ విష‌యంపై ఇప్పుడు హాట్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

శ్రీకాకుళంలో ఇప్పుడు న‌డుస్తున్న చ‌ర్చ ప్ర‌కారం రామ్మోహ‌న్ నాయుడు మ‌న‌సు ఎంపీ సీటుపై లేద‌ట‌. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అసెంబ్లీలో అధ్య‌క్షా అని పిల‌వాల‌ని ఆయ‌న మ‌న‌సు కోరుకుంటుంద‌ట‌. ఇదే విష‌యంపై ఆయ‌న అంత‌రింగ‌కుల ద‌గ్గ‌ర మ‌న‌సు విప్పి మాట్లాడార‌ట‌.

ఇంట్లో ప్రెష‌ర్ ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయ‌మ‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేస్తే ఏం లాభం? కేంద్రంలో బీజేపీనో...కాంగ్రెస్‌నో అధికారంలోకి వ‌స్తాయి. అక్క‌డ మ‌ళ్లీ పెద్ద ప‌ద‌వి ద‌క్కేది లేదు. ఒక‌వేళ కాలం క‌లిసి వ‌చ్చినా సీనియ‌ర్లు ఉన్నారు. వారికి కాద‌ని ప‌ద‌వి ఇచ్చేది లేదు. ఎంపీగా గెలిస్తే వేస్టు... ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఇంట్లో పోరు పెడుతున్నార‌ట‌.

రామ్మోహ‌న్ నాయుడు మామ బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి. ఈయ‌న వైజాగ్‌లోని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే. ఈయ‌న కూతురిని రామ్మోహ‌న్ నాయుడు పెళ్లి చేసుకున్నారు. దీంతో భార్య సైడ్‌తో పాటు నాయుడు ఇంట్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఒత్తిడి తీసుకొస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే జిల్లాలో ఆయ‌న పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం కోసం వెతుకుతున్నార‌ట‌. న‌ర‌స‌న్న‌పేట నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అని ఆయ‌న ట్ర‌య‌ల్స్ వేస్తున్నార‌ట‌. అయితే రామ్మోహ‌న్ నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయ‌న బాబాయి అచ్చెన్నాయుడికి ఇబ్బంది వ‌చ్చి ప‌డింది. ఒక వేళ టెక్క‌లి నుంచి తాను గెలిచి. అబ్బాయ్ కూడా ఎమ్మెల్యేగా గెలిస్తే.. టీడీపీ అధికారంలోకి వ‌స్తే మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందా? య‌వ‌నేత‌గా రామ్మోహ‌న్‌కు ఛాన్స్ ఇస్తారా? చంద్ర‌బాబు మ‌న‌సులో ఏముంది? అనే విష‌యం మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది.

మాట‌కారి, విష‌య ప‌రిజ్ఞానం ఉన్న రామ్మోహ‌న్‌కు తండ్రీ కొడుకులు చంద్ర‌బాబు, లోకేష్‌తో పాటు బాబాయ్ అసెంబ్లీలో అడుగుపెట్టినిస్తారా? అనేది మ‌రో ప్ర‌శ్న‌. మొత్తానికి ఎర్రన్నాయుడు కొడుకు రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఇప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్ డిబెట్ న‌డుస్తోంది.

First Published:  21 July 2022 1:28 AM GMT
Next Story