Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు, పవన్‌కు షాక్ తప్పదా..?

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.. షర్మిల ఏ కెపాసిటిలో కాంగ్రెస్‌లో పనిచేస్తారన్నది పక్కన పెట్టేస్తే స్టార్ క్యాంపెయినర్ గా ఉండటం తథ్యం.

చంద్రబాబు, పవన్‌కు షాక్ తప్పదా..?
X

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు షాక్ తప్పేట్లు లేదు. వచ్చేఎన్నికల్లో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నది చంద్రబాబు, పవన్ జాయింట్ పంతం. అందుకని విడివిడిగా పోటీచేస్తే చావుదెబ్బ తప్పదని ఇద్దరికీ అర్థ‌మైపోయింది. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా ఇద్దరూ చేతులు కలిపారు. రేపు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తుందన్నది ఇప్పటికైతే సస్పెన్సే. అయితే తమ కూటమికి 160 సీట్లు ఖాయమంటూ వీళ్ళిద్దరు నానా రచ్చచేస్తున్నారు. జగన్‌లో ఓటమి భయం పెరిగిపోతోందని ఎల్లోమీడియాలో పదే పదే రాయించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే వీళ్ళకి షాక్ కొట్టే డెవలప్మెంట్ జరగబోతోంది. అదేమిటంటే.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.. షర్మిల ఏ కెపాసిటిలో కాంగ్రెస్‌లో పనిచేస్తారన్నది పక్కన పెట్టేస్తే స్టార్ క్యాంపెయినర్ గా ఉండటం తథ్యం. షర్మిల కాంగ్రెస్ లో చేరగానే ముందుగా వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు, టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుని భంగపడిన వాళ్ళులో కొందరు హస్తంపార్టీలో చేరటం ఖాయం. మొత్తంమీద ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి మళ్ళీ పోటీచేస్తారు.

ఇదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తు కారణంగా టికెట్లు కోల్పోయిన తమ్ముళ్ళలో కొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయి. అంటే వైసీపీ, టీడీపీల నుంచి వచ్చి చేరే నేతల కారణంగా కాంగ్రెస్ పార్టీకి సడెన్ గా బూస్టప్ వచ్చినట్లవుతుంది. కాంగ్రెస్ ఎంత బలపడితే టీడీపీ-జనసేన కూటమికి అంత నష్టం. ఎందుకంటే.. ప్రభుత్వ పాజిటివ్ ఓట్లు ఎలాగూ వైసీపీకే పడతాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకే పడతాయని ఇంతకాలం చంద్రబాబు, పవన్ అనుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు పైరెండు పార్టీలకు పడే ఓట్లలో ఎన్నోకొన్నింటిని కాంగ్రెస్ కూడా లాక్కుంటుంది. కాంగ్రెస్ కు పడే ప్రతిఓటు టీడీపీ, జనసేనకు నష్టమనే చెప్పాలి.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఆరు ప్రతిపక్ష పార్టీల మధ్య చీలిపోతాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎంతచీలిపోతే అధికారపార్టీకి అంత మేలుచేస్తుంది. ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు, పవన్ కు షర్మిల పెద్ద షాకిస్తున్నట్లే అనుకోవాలి. ఏ పార్టీ ఎన్ని ఓట్లను చీల్చుకుంటుందన్న విషయం ఎన్నికల ఫలితాల తర్వాత కాని తేలదు.

First Published:  4 Jan 2024 11:45 AM IST
Next Story