జగన్ పై పవన్ ఏడుపెందుకు ?
జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏడుపు రోజురోజుకి పెరిగిపోతోంది.
జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏడుపు రోజురోజుకి పెరిగిపోతోంది. విశాఖలో మీడియాతో మాట్లాడుతు అధికార వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి మొత్తం పవర్సంతా తన చేతిలోనే పెట్టుకున్నారంటు మండిపోయారు. జగన్ చేతిలో ఇన్ని శాఖలు ఎందుకు పెట్టుకున్నట్లు ? శాఖల కేటాయింపు విషయంలో మాత్రం అధికార వికేంద్రీకరణ అమలు చేయరా ? అధికారమంతా ఒక వ్యక్తిచేతిలోనే ఉండాలా అంటు ఒక చెత్త లాజిక్ మాట్లాడారు.
ఇక్కడ పవన్ మరచిపోయిన విషయం ఏమిటంటే సీఎంతో కలిసి మంత్రిపదవులున్నదే 25. ప్రభుత్వంలో శాఖలు, విభాగాలు సుమారు 150కి పైగా ఉంటాయి. ఒక్కోమంత్రికి కొన్నిశాఖలను కేటాయించినా ఇంకా చాలా శాఖలు మిగిలిపోతాయి. కాబట్టి ఏ ప్రభుత్వంలో అయినా మంత్రులకు కేటాయించిన శాఖలు పోగా మిగిలిన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. ప్రభుత్వంలో హోం. ఆర్ధిక, రెవిన్యు లాంటివి ఏ ఐదో పదో శాఖలు కీలకమైనవి ఉంటాయంతే. ఇపుడు పైనచెప్పిన శాఖలన్నింటికీ ప్రత్యేకంగా మంత్రులున్న విషయం పవన్ మరచిపోయినట్లున్నారు.
ఈ శాఖల కేటాయింపన్నది జగన్తోనే మొదలుకాలేదు. ఇంతకుముందు చంద్రబాబునాయుడు ఇలాగే చేశారు. తెలంగాణాలో కేసీయార్ అయినా కేంద్రప్రభుత్వంలో నరేంద్రమోడీ అయినా ఇదే పద్దతిలో శాఖలు కేటాయిస్తారు. ఇక మూడు రాజధానుల విషయాన్ని తీసుకుంటే అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు దాన్ని డెవలప్ చేయటంలో పెయిలయ్యారు. చంద్రబాబు మార్క్ రాజధాని మరో 25 ఏళ్ళయినా డెవలప్ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబును ఘోరంగా ఓడించారంటేనే అమరావతి కాన్సెప్టు కూడా జనాలకు నచ్చలేదనే అనుకోవాలి. దాన్ని జగన్ అడ్వాంటేజ్ తీసుకున్నారంతే.
జగన్ పాలనతో పాటు మూడురాజధానుల కాన్సెప్టు నచ్చితే మళ్ళీ గెలిపిస్తారు. నచ్చకపోతే జనాలు జగన్ను కూడా ఓడిస్తారనటంలో సందేహం అక్కర్లేదు. ఇంతోటి విషయానికి విషయానికి అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల కాన్సెప్టుపై పవన్ ఏడుపేమిటో అర్ధం కావటంలేదు. పవన్ కూడా ఒకపుడు కర్నూలుకు వెళ్ళి కర్నూలే తనవరకు రాజధాని అని చెప్పారు. విశాఖకు వెళ్ళినపుడు వైజాగ్ రాజధానిగా బాగుంటుందన్న విషయాన్ని మరచిపోయినట్లున్నారు