పెండింగ్‌లో ఒక్క కేబినెట్ బెర్త్.. దక్కేది ఎవరికో..?
నిజానికి టీడీపీకి 20, జనసేనకు 4, బీజేపీకి 2 కేబినెట్ మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. కానీ చివరకు జనసేన 3, బీజేపీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు 25 మంది మంత్రులకు అవకాశం ఉంది. ఐతే చంద్రబాబు కేవలం తనతో పాటు 24 మంది మంత్రులతో కూడిన జాబితాను రిలీజ్ చేశారు. మరో స్థానాన్ని భర్తీ చేయకుండా వదిలేశారు. దీంతో ఆ ఒక్క స్థానం ఎవరి కోసం అనేది ఆసక్తిగా మారింది.
కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యేలున్న జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు. పవన్‌కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ జనసేన నుంచి మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇక 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించారు చంద్రబాబు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్‌కు కేబినెట్ బెర్త్ దక్కింది.
ఇక మరో స్థానం మిగిలి ఉండడంతో ఉత్కంఠ రేపుతోంది. నిజానికి టీడీపీకి 20, జనసేనకు 4, బీజేపీకి 2 కేబినెట్ మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. కానీ చివరకు జనసేన 3, బీజేపీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగిలిన ఒక్క స్థానం చంద్రబాబు మిత్రపక్షాలకు కేటాయిస్తారా.. లేక టీడీపీ వాళ్లకే ఇచ్చుకుంటారా అనేది సస్పెన్స్‌గా మారింది.