పవన్ 'వారాహి' ఖర్చు ఆ నిర్మాతదేనా? కలర్‌పై కూడా జోరుగా చర్చలు!
పవన్ కల్యాణ్ తన సినిమా టీజర్ల లాగానే బస్సు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. దానికి 'వారాహి' అనే పేరు పెట్టుకున్నారు. అంతా సినిమా స్టైల్‌లోనే పవన్ బస్సు లుక్కును విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జనసేన అధినేత, సినిమా స్టార్ పవన్ కల్యాణ్ రాబోయే ఏపీ ఎన్నికల కోసం సంసిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఎన్టీ రామారావు చైతన్య రథంలో ప్రజల్లోకి వెళ్లిన మాదిరిగానే.. తాను కూడా ప్రత్యేక బస్సులో వెళ్లాలని అనుకున్నారు. అందుక తగినట్లుగా ఒక ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించుకున్నారు. ఈ బస్సులో అనేక అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. యాత్ర సమయంలో పోకరీల నుంచి ధ్వంసం కాకుండా వాహనాన్ని పటిష్టంగా తయారు చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ తన సినిమా టీజర్ల లాగానే బస్సు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. దానికి 'వారాహి' అనే పేరు పెట్టుకున్నారు. అంతా సినిమా స్టైల్‌లోనే పవన్ బస్సు లుక్కును విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ బస్సు పేరు చూసి అందరూ బాహుబలి సినిమాలను నిర్మించిన 'వారాహి' ప్రొడక్షన్ నిర్మాతలు స్పాన్సర్ చేసినట్లు చర్చ జరుగుతున్నది. సాయి కొర్రపాటి ఈ వాహన ఖర్చులు భరించినట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి సాయి కొర్రపాటి.. సినీ నటుడు బాలకృష్ణ అభిమాని. తెలుగు దేశం పార్టీకి కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. టీడీపీకి సంబంధించిన ప్రమోషన్ల విషయంలో వెనుక ఉండే డైరెక్టర్ రాఘవేంద్రరావు.. చాలా సన్నిహితుడు. గుంటూరు జిల్లాకు చెందిన సాయి మొదటి నుంచి టీడీపికి మంచి సపోర్టర్‌గా ఉన్నారు. అలాంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయడంపై పలు కామెంట్లు వెలువడుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి నుంచి పవన్ కల్యాణ్ వెనుక ఉన్నారనే వాదనలు ఉన్నాయి. అందుకే పవన్ యాత్రకు కూడా టీడీపీ నేతలు స్పాన్సర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పవన్ తన సొంత డబ్బులతోనే యాత్ర బస్సులు చేయించుకున్నారని జనసేన అభిమానులు వాదిస్తున్నారు. మహా అయితే ఆ బస్సుకు రూ. 1 కోటి వరకు అవుతాయని.. సినిమాల ద్వారా వచ్చే డబ్బులతోనే తన వాహనాన్ని తయారు చేయించుకున్నారని, టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.
కలర్ ఓకేనా..
పవన్ కల్యాణ్ తన యాత్ర బస్సుకు ఆలీవ్ గ్రీన్ కలర్ వేయించారు. దీనిపై కూడా అభ్యంతరాలు వెలువడుతున్నాయి. కేంద్ర రవాణా శాఖ నిబంధనల ప్రకారం కేవలం ఆర్మీ వెహికిల్స్ మాత్రమే ఆలీవ్ గ్రీన్ కలర్‌ను తమ వాహనాలకు ఉపయోగించాలి. అయితే వారాహి పేరుతో బయటకు తీసుకొచ్చిన ఈ వాహనం కూడా ఆలీవ్ గ్రీన్‌లో ఉన్నది. ఆర్మీ ఉపయోగించే రంగుతో ఉన్న ఈ వాహనానికి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో తెలంగాణ ఆర్టీఏ (బండి తయారీ/పవన్ ఆధార్ కారణంగా) రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.
మిలెటరీ వెహికల్ కలర్ సివిలియన్స్ వాడకూడదు, RTA రిజిస్ట్రేషన్ చెయ్యదు. ఆ వెహికల్ కలర్ ఏసేటోడన్న చెప్పి సావొచ్చుగా.
— Rajendra Varma Veligandla (@rajendra539) December 7, 2022
మంచిగా కాషాయ రంగు వేసుకోవచ్చు కదా pic.twitter.com/aYbTxQtVCU