Telugu Global
Andhra Pradesh

కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు అర్హులు ఎవరు ?

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అమలు కాబోతున్నాయి. ఆ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏమేం అర్హతలుండాలో ప్రభుత్వం ప్రకటించింది.

కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు అర్హులు ఎవరు ?
X

ఆంధ్రప్రదేశ్ లో నిరు పేద యువతుల వివాహాలకు సహకారం అందించేందికి ప్రభుత్వం కల్యాణమస్తు, షాదీ తోఫా పేరుతో పథకాలను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలు రేపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకోసం అమలు చేయనున్న‌ కల్యాణమస్తు, ముస్లిం మైనారిటీల కోసం అమలు చేయనున్న‌ షాదీ తోఫా కు అర్హుతలేంటి అనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

1.పెళ్ళి కుమార్తె వయసు 18, పెళ్ళి కుమారుడి వయసు 21 నిండాలి.

2.ఇద్దరూ తప్పని సరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

3.వారిద్దరి కుటుంబాల్లో ఆదాయపన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు.

4.వారి కుటుంబాల నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 వేలు, పట్టణాల్లో అయితే రూ.12 వేలు మించరాదు.

5.నెలసరి విద్యుత్ వాడకం 300 యూనిట్లకు మించకూడదు.

6.ఎస్సీ, ఎస్టీ వధూవరులకు 1 లక్ష రూపాయలు ఇస్తారు.

7.బీసీలకు 50 వేల రూపాయలు

8.మైనారిటీలకు 1 లక్ష రూపాయలు ఇస్తారు.

9.ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే 1లక్షా 20 వేల రూపాయలు

10.బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే 75 వేల రూపాయలు

11.దివ్యాంగులకు 1లక్షా 50 వేల రూపాయలు

12.భవన నిర్మాణ కార్మికులకు 40 వేల రూపాయలు అందిస్తారు.

13.కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు 6 దశల్లో తనిఖీలు ఉంటాయి.

First Published:  30 Sept 2022 3:27 PM IST
Next Story