Telugu Global
Andhra Pradesh

జగన్, బాబు సరే.. పవన్ ఎక్కడ..?

పోనీ ఫామ్ హౌస్ లో ఉంటే.. పుస్తకాలు చదువుతున్నట్టో, ఆవులకు మేత వేస్తున్నట్టో వీడియోలు బయటకు వచ్చావి. అవేవీ లేవు కాబట్టి పవన్ హైదరాబాద్ లో కూడా లేరని అనుకోవాలి.

జగన్, బాబు సరే.. పవన్ ఎక్కడ..?
X

ఏపీ ఎన్నికల తర్వాత సీఎం జగన్ లండన్ వెళ్లారు.

చంద్రబాబు ముందు అమెరికా వెళ్లారని అన్నారు, ఆ తర్వాత ఇటలీ అంటున్నారు.

పవన్ కల్యాణ్ ఎక్కడ..?

పవన్ సంగతి మాత్రం అధికారికంగా లేదా అనధికారికంగా ఎవ్వరికీ తెలియడంలేదు. కనీసం జనసేన వర్గాలు కూడా ఆయన ఎక్కడున్నారని చెప్పలేకపోతున్నాయి. కాకపోతే పవన్ పేరిట అప్పుడప్పుడు ప్రెస్ నోట్లు మాత్రం విడుదలవుతున్నాయి.

ఇంతకీ పవన్ ఎక్కడ..?

ఏపీలో ఎన్నికలు ఈనెల 13న పూర్తి కాగా, 14వతేదీ పవన్ వారణాసి వెళ్లారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కి వచ్చారని తెలుస్తోంది. అక్కడినుంచి ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. పోనీ ఫామ్ హౌస్ లో ఉంటే.. పుస్తకాలు చదువుతున్నట్టో, ఆవులకు మేత వేస్తున్నట్టో వీడియోలు బయటకు వచ్చావి. అవేవీ లేవు కాబట్టి ఆయన హైదరాబాద్ లో లేరని అనుకోవాల్సిందే. మరి పవన్ ఎక్కడికి వెళ్లారు..?


రష్యా, లేదా దుబాయ్..

పోలింగ్ రోజు సతీ సమేతంగా మంగళగిరి వచ్చి ఓటు వేసి, ఆ తర్వాత పిఠాపురం వచ్చి వెళ్లిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారనేది సస్పెన్స్ గా మారింది. జగన్ లండన్ వెళ్లడం అధికారిక సమాచారం, ఆయన టూర్ కి సంబంధించి వీడియోలు కూడా ఉన్నాయి. చంద్రబాబు అమెరికా వెళ్లారా, లేక ఇటలీ వెళ్లారా అనేది మాత్రం ఇప్పటికీ అనుమానం. అధికారిక సమాచారమేదీ లేదు. కనీసం చంద్రబాబు ఫలానే దేశం వెళ్లారనే వార్తలయినా బయటకు వస్తున్నాయి, పవన్ కల్యాణ్ విషయంలో అలాంటి లీకులు కూడా లేవు. పవన్ ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియదు. ఆయన రష్యా, లేదా దుబాయ్ వెళ్లి ఉంటారని మాత్రం ఊహాగానాలు వినపడుతున్నాయి.

First Published:  22 May 2024 2:48 AM GMT
Next Story