Telugu Global
Andhra Pradesh

వైఎస్ఆర్ నా బెస్ట్ ఫ్రెండ్.. బాబు వ్యూహం ఏంటి..?

సడన్‌గా చంద్రబాబు తన బెస్ట్ ఫ్రెండ్ వైఎస్ఆర్ అని చెప్పడం కాస్త విశేషమే. రాజకీయ లాభం లేకుండా చంద్రబాబు ఏ పనీ చేయరు, ఏ మాటా మాట్లాడరు కాబట్టి.. కచ్చితంగా దీని వెనక ఏదో మతలబు ఉందని అనుకోవాల్సిందే.

వైఎస్ఆర్ నా బెస్ట్ ఫ్రెండ్.. బాబు వ్యూహం ఏంటి..?
X

బాలకృష్ణ ఓటీటీలో చేసే అన్ స్టాపబుల్ సీజన్-2లో తొలి ఎపిసోడ్ చంద్రబాబుతో మొదలవుతోంది. ఈ ఎపిసోడ్ టీజర్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు, చంద్రబాబు సమాధానాలు, మధ్యలో నారా లోకేష్ ప్రస్తావన.. ఇలా సాగుతుంది ఈ టీజర్. అయితే అన్నిటికీ మించి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ చంద్రబాబు చెప్పిన సమాధానం కాస్త ఆసక్తిగా ఉంది.

చంద్రబాబుకి చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో మాత్రం రాజశేఖర్ రెడ్డితో ఆయనకు వైరం మాత్రమే ఉంది. అసెంబ్లీలో చంద్రబాబు, వైఎస్ఆర్ మధ్య మాటల తూటాలు పేలితే ఎప్పుడూ రాజశేఖర్ రెడ్డే విజేతగా నిలిచేవారు. అలాంటి రాజశేఖర్ రెడ్డిని తన బెస్ట్ ఫ్రెండ్ అని చంద్రబాబు ఎందుకు చెప్పాల్సి వచ్చింది. దీని వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

వైఎస్ఆర్ అభిమానుల కోసమేనా..?

వైఎస్ఆర్‌ని అభిమానించేవారు తనని ద్వేషించకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో చంద్రబాబు ఈ మాట చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ అభిమానించేవారంతా వైసీపీతోనే ఉంటారని చెప్పలేం. ఆ మాటకొస్తే వైఎస్‌ని వ్యక్తిగతంగా ఆరాధించేవారు కాంగ్రెస్‌లోనూ ఉన్నారు. కానీ వారు జగన్‌కి మద్దతుగా రాలేకపోయారు. అలాంటి వారంతా చంద్రబాబుని మాత్రం ద్వేషిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ వర్సెస్ వైఎస్ఆర్ అనేలా హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారం బాగా హైలెట్ అయింది. ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లో ఎవరు గొప్ప అనే చర్చ మొదలైంది. ఇరు వర్గాల పరస్పర విమర్శల తర్వాత ఇప్పుడు అందరూ ఆ విషయాన్ని పక్కనపెట్టారు. ఈ దశలో సడన్‌గా చంద్రబాబు తన బెస్ట్ ఫ్రెండ్ వైఎస్ఆర్ అని చెప్పడం కాస్త విశేషమే. రాజకీయ లాభం లేకుండా చంద్రబాబు ఏ పనీ చేయరు, ఏ మాటా మాట్లాడరు కాబట్టి.. కచ్చితంగా దీని వెనక ఏదో మతలబు ఉందని అనుకోవాల్సిందే.

వెన్నుపోటుని కూడా కవర్ చేస్తారా..?

ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు టీడీపీని తీసుకున్నారనే విషయం ఇటీవల చాలా సార్లు సోషల్ మీడియాలో హైలెట్ అయింది. ఆనాడు జరిగిన ఎపిసోడ్‌కి ఈ షో ద్వారా మసిపూయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఆ టైంలో ఎన్టీఆర్‌ని ఎంతో బతిమిలాడుకున్నానని, కాళ్లు పట్టుకున్నానంటూ చంద్రబాబు చెబుతున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఇందులో బాలకృష్ణని కూడా ఇన్వాల్వ్ చేసేలే చంద్రబాబు మైండ్ గేమ్ ఆడారు. ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇక ఫుల్ ఎపిసోడ్‌లో అసలు చంద్రబాబు నట విశ్వరూపం జనాలు చూడబోతున్నారు. ఈనెల 14 నుంచి ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది.

First Published:  12 Oct 2022 2:53 PM IST
Next Story