కొడుకును తిడుతూ, తండ్రిని పొగుడ్తున్న బాబు.. మతలబు ఏంటీ..?
వైఎస్సార్ ను మెచ్చుకున్నందుకు ఆయన అభిమానులు టీడీపీకి ఓట్లు వేయకపోతారా అని చంద్రబాబు ఆలోచనలాగుంది. వైఎస్సార్ అభిమానులంతా ఇప్పుడు వైసీపీతోనే ఉన్నారు. వైఎస్సార్ కోటరీగా ముద్రపడిన వాళ్ళల్లో కూడా చాలామంది జగన్ పక్కనే ఉన్నారు.
తానేం మాట్లాడుతున్నారో కూడా పాపం ఫార్టీ ఇయర్స్ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు అర్థమవుతున్నట్లు లేదు. ఇప్పుడు విషయం ఏమిటంటే.. మూడు రోజుల గుంటూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు వైఎస్సార్ జపం చేశారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని సైకో అని నిందిస్తూనే మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను మాత్రం బ్రహ్మాండమని చెప్పటం చంద్రబాబుకే చెల్లింది. అసలు వైఎస్సార్ ను మెచ్చుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చింది..?
వైఎస్సార్ ను మెచ్చుకున్నందుకు ఆయన అభిమానులు టీడీపీకి ఓట్లు వేయకపోతారా అని చంద్రబాబు ఆలోచనలాగుంది. వైఎస్సార్ అభిమానులంతా ఇప్పుడు వైసీపీతోనే ఉన్నారు. వైఎస్సార్ కోటరీగా ముద్రపడిన వాళ్ళల్లో కూడా చాలామంది జగన్ పక్కనే ఉన్నారు. ఎవరో అరకొరా మాత్రమే ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. జగన్ తో వేవ్ లెంగ్త్ సెట్ కాకపోవడంతోనే వాళ్లు కాంగ్రెస్ లోనే ఉండిపోయారు.
ఇక వైఎస్సార్ ను కాంగ్రెస్ నేతలు బ్రహ్మాండమన్నా, టీడీపీ ఎంత పొగిడినా వాళ్లెవరూ వైసీపీకి తప్ప వేరేపార్టీకి ఓట్లేయరని చంద్రబాబుకు అర్థం కావటంలేదేమో. తండ్రిని పొగుడుతూ కొడుకును అసభ్యంగా తిడుతుంటే ఎవరైనా టీడీపీకి ఓట్లేస్తారా..? ఐటీ పరిశ్రమను హైదరాబాద్ కు తానే తెచ్చానన్న చంద్రబాబు.. తన తర్వాత సీఎం అయిన వైఎస్ కూడా తన విధానాలను కంటిన్యూ చేయబట్టే హైదరాబాద్ మరింత డెవలప్ అయ్యిందని చెప్పారు. జగన్ మాదిరే వైఎస్ కూడా ఐటీ పరిశ్రమలను కూల్చేసుంటే ఏమయ్యుండేది అనే పిచ్చి ప్రశ్న వేశారు. ఇందుకే వైఎస్సార్ ను తాను శభాష్ అంటున్నట్లు కూడా చెప్పారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ఏపీని ఏ విధంగా డెవలప్ చేశారు..? ఇప్పుడు జగన్ కూల్చేసిన డెవలప్మెంట్ ఏముంది..? ఈ విషయాలను ఉదాహరణలతో చెప్పకుండా వైఎస్ జపం చేస్తే ఆయన అభిమానుల ఓట్లు పడతాయనే భ్రమల్లో ఉన్నట్లున్నారు. చాలాసార్లు వైఎస్సార్ గురించి బ్రహ్మాండమంటూ చంద్రబాబు మాట్లాడిన విషయాలు గుర్తుండే ఉంటాయి.