ఏపీకి IPL టీమ్..! పేరేంటంటే..?
ఏపీ ఐపీఎల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో కూడా జోకులు పేలుతున్నాయి. దీనిపై నారా లోకేష్ కూడా సెటైర్లు వేశారు.
IPL క్రికెట్ మ్యాచ్ లనేవి పక్కా ప్రైవేట్ వ్యవహారం. ఆ టీమ్ లను ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్డ్ చేసిన ఉదాహరణలు లేవు. ప్రభుత్వాలకు ఆసక్తి ఉంటే ఆయా టీమ్ లకు ఎక్కడైనా ప్రమోషన్ కల్పిస్తాయి కానీ నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేదు. అయితే చెన్నై లాగా ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ ఉండాలంటోంది ఏపీ ప్రభుత్వం. ఏపీనుంచి కూడా ఓ ఐపీఎల్ టీమ్ ని రెడీ చేసి పంపించాలని సీఎం జగన్ చెప్పారని, ఆ పనిమీదే ఉన్నామన్నారు మంత్రి రోజా. ఆడుదాం ఆంధ్రా అనే పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం త్వరలో ఐపీఎల్ ఎంట్రీకి సిద్ధపడుతున్నామని చెబుతోంది.
ఐపీఎల్ పై లోకేష్ పంచ్ లు..
ఏపీ ఐపీఎల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో కూడా జోకులు పేలుతున్నాయి. దీనిపై నారా లోకేష్ కూడా సెటైర్లు వేశారు. జాతీయ స్థాయి క్రీడలకు వెళ్లేందుకు కూడా మన క్రీడాకారులకు ప్రోత్సాహం లేదని, అలాంటిది ఐపీఎల్ టీమ్ ఏంటని ప్రశ్నించారు లోకేష్. ఏపీ ఐపీఎల్ టీమ్ కి ఏం పేరు పెడతారని నాలుగు ఆప్షన్లు చదివి వినిపించారు.
1) త్రీ క్యాపిటల్స్
2) కోడి కత్తి వారియర్స్
3) జేసీబీ నైట్ రైడర్స్
4) బూమ్ బూమ్ ఛాలెంజర్స్ అంటూ వెటకారం చేశారు లోకేష్.
జగన్ ఐపీఎల్ క్రికెట్ టీం ఏమి పేరు పెడతాడు ? 1) త్రీ క్యాపిటల్స్ 2. కోడి కత్తి వారియర్స్ 3. జేసీబీ నైట్ రైడర్స్ 4. బూమ్ బూమ్ ఛాలెంజర్స్. #LokeshinKavali #YuvaGalamPadayatra#YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#yuvagalamlokesh#AndhraPradesh pic.twitter.com/QJRoLjgU9A
— Telugu Desam Party (@JaiTDP) July 10, 2023
నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు తుది దశకు చేరుకుంది. అనంతరం ఆయన ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తారు. కడప జిల్లా నుంచి నెల్లూరుకి వచ్చిన లోకేష్.. ఇక్కడ స్థానిక వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కాకాణి, అనిల్ ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. తాజాగా కావలి మీటింగ్ లో సీఎం జగన్ పై మండిపడ్డారు లోకేష్.