ప్రశాంత్ కిశోర్ బండారాన్ని బయటపెట్టిన దీదీ
ప్రశాంత్ కిశోర్ క్షేత్ర స్థాయిలో పనిచేయరని, తన అభిప్రాయాలు మాత్రమే చెప్తారని దీదీ అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రశాంత్ కిశోర్ గురించి మాట్లాడారు.
ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ బండారాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతారని పీకే అభిప్రాయపడిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆయన జగన్ కోసం పనిచేశారు. మమతా బెనర్జీ కోసం కూడా పనిచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో విజయాన్ని పీకే తన ఖాతాలో వేసుకున్నారు. పీకే ఇప్పుడు తన పార్టీకి కూడా పనిచేయడం లేదని మమతా స్పష్టం చేశారు.
ప్రశాంత్ కిశోర్ క్షేత్ర స్థాయిలో పనిచేయరని, తన అభిప్రాయాలు మాత్రమే చెప్తారని దీదీ అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రశాంత్ కిశోర్ గురించి మాట్లాడారు. ప్రజల్లో పనిచేయకుండానే ప్రశాంత్ కిశోర్ చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటన చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రశాంత్ కిశోర్ టీడీపీ, బీజేపీలకు పనిచేస్తున్నారని కూడా ఆమె అన్నారు. ప్రశాంత్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని రుజువు చేయడానికి తగిన సమాచారం తన వద్ద ఉందని మమతా చెప్పారు.
ప్రశాంత్ కిశోర్ కు ఇతరత్రా ఏవో సమస్యలున్నాయని ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిశోర్ ఐ-ప్యాక్ నుంచి తప్పుకున్నారు. ఆయనకు ఐ- ప్యాక్ తో ఏ విధమైన సంబంధం లేదు. బీహార్ లో ఆయన రాజకీయ పార్టీ పెట్టి, పాదయాత్ర చేశారు. అయితే, ఎన్నికల్లో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆయన మళ్లీ తన వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఆయన చంద్రబాబు కోసం పనిచేస్తూ ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నారు. తటస్థంగా ఉన్నట్లు కలర్ ఇస్తూ చంద్రబాబుకు మేలు చేయాలనే ఎత్తుగడతో ఆయన వ్యవహరిస్తున్నారు.