Telugu Global
Andhra Pradesh

సంపద సృష్టి అబద్ధం.. చంద్రబాబు మార్కు మోసం

14 ఏళ్ల పాలనలో సంపద సృష్టించడం చేతకాని చంద్రబాబు, ఇప్పుడు కొత్త నాయకుడిలాగా ప్రజల ముందుకు వచ్చి సంపద సృష్టించి పేదలకు పంచుతాను అంటే నమ్మేదెలా..?

సంపద సృష్టి అబద్ధం.. చంద్రబాబు మార్కు మోసం
X

ఏడాదికి 70వేల కోట్ల రూపాయల ఖర్చుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం జగన్.

చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1,50,718 కోట్లు కావాలి.

ఇది పూర్తిగా అసాధ్యం అనే విషయం అందరికీ తెలుసు. అయితే దీన్ని కవర్ చేసుకోడానికి చంద్రబాబు చెబుతున్న మాట సంపద సృష్టి. తాను చేసే మోసాలను, చెప్పే అబద్ధాలను కప్పి పుచ్చుకోడానికి చంద్రబాబు ఆడుతున్న నాటకం ఇది.

చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయాలంటే ఏపీ బడ్జెట్ సరిపోదు. ఆ విషయం బాబుకి కూడా తెలుసు. అయినా కూడా ప్రజల్ని మోసం చేయడానికే అలవికాని హామీలను కేవలం ఓట్లకోసమే మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటన్నిటికీ డబ్బులెక్కడినుంచి తెస్తారని ప్రశ్నిస్తే మాత్రం సంపద సృష్టిస్తామంటున్నారు చంద్రబాబు. అసలు సంపద సృష్టి అంటే అర్థమేంటి..? సంపదను ఎలా సృష్టిస్తారు..? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎంత సంపద సృష్టించారు..? ఎంతమందికి పంచిపెట్టారు..?

రెవెన్యూ లోటుతోనే పాలన..

చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశారు. ఆయన హయాంలో ఏ ఒక్కసారి కూడా రెవెన్యూ మిగులు లేకపోవడం విశేషం. ప్రతి ఏడాదీ రెవెన్యూ లోటుతోనే పాలన జరిగింది. రెవెన్యూ ఖర్చులకోసం లోటు చూపిస్తున్నప్పుడు సంపద ఎక్కడ నుంచి సృష్టిస్తారు. 14 ఏళ్ల పాలనలో సంపద సృష్టించడం చేతకాని చంద్రబాబు, ఇప్పుడు కొత్త నాయకుడిలాగా ప్రజల ముందుకు వచ్చి సంపద సృష్టించి పేదలకు పంచుతాను అంటే నమ్మేదెలా..?

సంపద సృష్టించే శక్తి లేదు, సమగ్రమైన ఆర్ధిక నియంత్రణ చేతకాదు, 14 ఏళ్ల పాలన దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం, అయినవాళ్లకి పంచుకోవడం.. ఇదే చంద్రబాబు హయాంలో జరిగింది అని సీఎం జగన్ కూడా విమర్శించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కూడా గతంలో చంద్రబాబు ఇవ్వలేకపోయారు. అంటే ఆ మేరకు అక్కడ ఆర్థిక క్రమశిక్షణ లేదు అనే విషయం తేలిపోయింది. జగన్ హయాంలో అవినీత లేదు, వివక్షత లేదు కాబట్టే ఇన్ని పథకాలు అమలవుతున్నాయి. చంద్రబాబు హయాంలో అవినీతి రాజ్యమేలింది కాబట్టే పథకాలు అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా సంపద సృష్టి అంటూ నాటకాలాడుతున్నారు బాబు.

ఆ మాయలో పడొద్దు..

చంద్రబాబు మేనిఫెస్టో అమలు అసాధ్యం. పోనీ నామమాత్రంగా ఆ పథకాలను అమలు చేసినా ఘోరమైన కండిషన్లు పెట్టాల్సిన పరిస్థితి. అంటే లబ్ధిదారుల సంఖ్య దారుణంగా పడిపోతుంది. వివిధ కారణాలు చెప్పి ఇప్పుడున్నవారిలో సగానికి సగం కోతపెడితేనే వాటిని అమలు చేయొచ్చు. అంటే చంద్రబాబు చేయాలనుకున్న మోసాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు.

First Published:  3 May 2024 9:25 AM IST
Next Story