పవన్ ఫొటోలను చెప్పులతో కొట్టి, తగలబెట్టి..
వాలంటీర్ల జోలికొస్తే.. తాటతీస్తామంటూ హెచ్చరించారు. మహిళా కమిషన్ కు వాలంటీర్లు, మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ పవన్ కల్యాణ్ కి నోటీసులు జారీ చేసింది.
పవన్ కల్యాణ్ పై గతంలో వైసీపీ శ్రేణులు విమర్శలు చేసినా, ఆయన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించినా అది ఒక లిమిట్ వరకే ఉండేది. కానీ ఇప్పుడు పవన్ పై వాలంటీర్లు తిరగబడ్డారు. మహిళా వాలంటీర్లు పవన్ ఫొటోలను చెప్పులతో కొట్టారు, రోడ్డుపై కుప్పపోసి తగలబెట్టారు. వాలంటీర్లపై ఆయన ఏలూరులో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు.
మహిళా కమిషన్ నోటీసులు..
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు పవన్ పై మండిపడ్డారు, సచివాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. వాలంటీర్ వ్యవస్థపై అసత్య ఆరోపణలు చేసిన ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల జోలికొస్తే.. తాటతీస్తామంటూ హెచ్చరించారు. మహిళా కమిషన్ కు వాలంటీర్లు, మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ పవన్ కి నోటీసులు జారీ చేసింది. ఏపీలో మహిళల అదృశ్యం వెనక వాలంటీర్లు ఉన్నారన్న వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని కోరింది.
వైసీపీ విమర్శలు..
వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వాలంటీర్ వ్యవస్థని ప్రధాని మోదీ ప్రశంసిస్తే, పవన్ మాత్రం విషం కక్కుతున్నారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. వారు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామని ప్రకటించే దమ్ము పవన్, చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా.. పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాలంటీర్లకు, రాష్ట్ర మహిళలకు పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.