Telugu Global
Andhra Pradesh

వైజాగ్ స్టీల్ ప్లాంట్: బిడ్ వేయడానికి మరింత సమయం కోరిన సింగరేణి... గడవు పెంచిన RINL

తాము బిడ్ వేయడానికి మరింత సమయం కావాలని సింగరేణి కాలరీస్ లిమిటెడ్ చేసిన అభ్యర్థన మేరకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఈ నిర్ణయం తీసుకుంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్: బిడ్ వేయడానికి మరింత సమయం కోరిన సింగరేణి... గడవు పెంచిన RINL
X

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ క్యాపిటల్/ముడి పదార్థాల అవసరాలకు RINL ద్వారా ఉక్కు సరఫరాకు నిధులు సమకూర్చడానికి బిడ్ దాఖలు చేయాల్సిన చివరి తేదీని ఈ నెల 20 వరకు పొడిగించారు.

తాము బిడ్ వేయడానికి మరింత సమయం కావాలని సింగరేణి కాలరీస్ లిమిటెడ్ చేసిన అభ్యర్థన మేరకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఈ నిర్ణయం తీసుకుంది.

నిన్న మధ్యాహ్నం 3 గంటలకు బిడ్లను ముగించే సమయానికి 22 బిడ్లు వచ్చినట్లు RINL అధికారులు చెప్పారు. శనివారం రోజున. బిడ్డర్లలో ఆరు బహుళజాతి కంపెనీలు కూడా ఉన్నాయి. ట్రేడ్ యూనియన్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఉక్రెయిన్‌లో యుద్దం కారణంగా తన కార్యకలాపాలను మూసివేసిన ఆ దేశానికి చెందిన కంపెనీ కూడా బిడ్డింగ్‌లో పాల్గొన్నట్లు చెబుతున్నారు

బిడ్లు వేసిన సంస్థలు:

ఇండో ఇంటర్‌ ట్రేడ్‌ ఏజీ (స్విట్జర్లాండ్‌),

ఇండో ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ (దుబాయ్‌),

ఐఎంఆర్‌ మెటలర్జికల్‌ రిసోర్సెస్‌ ఏజీ,

సూరజ్‌ముల్‌ బైజ్యనాథ్‌ ప్రైవేటు లిమిటెడ్‌,

జేఎ స్ డబ్ల్యూ స్టీల్‌,

వినార్‌ ఓవర్‌సీస్‌ (ముంబై),

టీయూఎఫ్‌ గ్రూపు (ఢిల్లీ),

జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (అంగుల్‌),

అగోరా పార్టనర్స్‌,

శ్రీసత్యం ఇస్పాత్‌ ప్రైవేటు లిమిటెడ్‌,

ఎస్‌బీ ఇంటర్నేషనల్‌ ఇన్‌ కార్పొరేషన్‌ (డల్లాస్‌),

టాటా ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌,

యురోపా ఇంపోర్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌,

గ్లోబల్‌ సాఫ్ట్‌ పీటీఈ లిమిటెడ్‌ (సింగపూర్‌),

వెన్స్‌ప్రా ఇంపెక్స్‌ (విజయవాడ-మాజీ జేడీ లక్ష్మీనారాయణ),

ఎలిగెంట్‌ మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌,

ఎల్‌కే శ్రీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ,

అరోగ్లోబల్‌ కామ్‌ ట్రేడ్‌, ఎవెన్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌,

వాడిమ్‌ నోవిన్‌స్కై అలెగ్జాండ్రా,

రూటేజ్‌ ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ సంస్థలు బిడ్లు వేశాయి.

First Published:  16 April 2023 9:02 AM IST
Next Story