విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో ట్విస్ట్..
కేంద్రం తూచ్ అనడంతో ఇప్పుడు మళ్లీ అయోమయం మొదలైంది. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సహాయ మంత్రి ఎందుకలా చెప్పారు, ఆ తర్వాత కేంద్రం ఎందుకిలా మెలిక పెట్టింది అనేది తేలాల్సి ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోలేదని, కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోయినట్టు మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తేల్చి చెప్పింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. స్టీల్‌ప్లాంట్ పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తమ వంతు కృషి చేస్తాయని తెలిపింది.
ఫగ్గన్ సింగ్ మాటల మర్మమేంటి..?
ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం అనుకోవడం లేదని, ప్లాంటును బలోపేతం చేసే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నామంటూ నిన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం చేసిన వ్యాఖ్యలతో అసలు కథ మొదలైంది. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గిందని మీడియా కథనాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సంబరపడ్డారు. అయితే ఒక్కరోజులోనే వ్యవహారం తిరగబడింది. కేంద్రం నాలుక మడతేసింది. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్ధంగా ఉందంటూ తేల్చి చెప్పింది.
.@SteelMinIndia clarifies that there is no freeze on the disinvestment process of Rashtriya Ispat Nigam Ltd. (RINL)
— PIB India (@PIB_India) April 14, 2023
"The process is under progress & efforts are being made to improve its performance," said the Ministry
Details: https://t.co/a6HfFJPrNk
కేంద్రం తూచ్ అనడంతో ఇప్పుడు మళ్లీ అయోమయం మొదలైంది. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సహాయ మంత్రి ఎందుకలా చెప్పారు, ఆ తర్వాత కేంద్రం ఎందుకిలా మెలిక పెట్టింది అనేది తేలాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల స్పందన ఏంటనేది తేలాల్సి ఉంది.