Telugu Global
Andhra Pradesh

హంత‌కుడి మీద అంత అభిమానం ఎందుకు సునీత‌?

దస్తగిరి బెయిల్ విషయమై నిర్ణయం తీసుకునేముందు తన వాదన కూడా వినాలని సునీత పిటీషన్‌లో అడిగారు. కారణం ఏమిటంటే దస్తగిరి బెయిల్ రద్దు కోరే హక్కు బాధితురాలిగా తనకు మాత్రమే ఉంటుందన్నారు.

హంత‌కుడి మీద అంత అభిమానం ఎందుకు సునీత‌?
X

వివేకానందరెడ్డి మర్డర్ కేసు రోజురోజుకు కాంప్లికేట్ అవుతోంది. కారణం ఏమిటంటే కొత్తకొత్తవాళ్ళు తెరమీదకు వస్తుండటమే. మొన్నటివరకు సాక్షిగా ఉన్న వివేకా పీఏ కృష్ణారెడ్డి తర్వాత బాధితుడయ్యారు. ఇప్పుడేమో అనుమానితుడైపోయారు. మరి రేపు నిందితుడవుతాడేమో తెలియ‌దు. దీనంతటికీ కారణం వివేకా కూతురు సునీతే కావటం విచిత్రంగా ఉంది. వివేకా హంతకుల్లో కీలక వ్యక్తి దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కృష్ణారెడ్డి మిస్ లేనియస్ పిటీషన్ వేశారు. దాన్ని కోర్టు విచారణకు స్వీకరించింది.

వెంటనే సునీత ఇంప్లీడ్ పిటీషన్ వేసేశారు. దస్తగిరి బెయిల్ విషయమై నిర్ణయం తీసుకునేముందు తన వాదన కూడా వినాలని సునీత పిటీషన్‌లో అడిగారు. కారణం ఏమిటంటే దస్తగిరి బెయిల్ రద్దు కోరే హక్కు బాధితురాలిగా తనకు మాత్రమే ఉంటుందన్నారు. కృష్ణారెడ్డి బాధితుడు కాదు అనుమానితుడని సునీత లాయర్ సిద్దార్ధ లూథ్రా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ చాలాకాలం ఆయన్ను కేవలం సాక్షిగా మాత్రమే చెప్పింది. ఈ మధ్యనే హత్యకేసులో కృష్ణారెడ్డి పాత్రలేదని కూడా చెప్పింది.

అలాంటిది సడెన్‌గా సునీత అనుమానితుడని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా విచారణ పేరుతో తనను సీబీఐ కస్టడీలో తీసుకుని చిత్రహింసలకు గురిచేసిందని కృష్ణారెడ్డి తన పిటీషన్లో పేర్కొన్నారు. దస్తగిరి బయట తిరుగుతుంటే తనను కస్టడీలోకి తీసుకోవటం ఏమిటని అడుగుతున్నారు. హంతుకుడు దస్తగిరి అప్రూవర్‌గా ఎలా మారుతాడన్నది కృష్ణారెడ్డి వాదన. అందుకనే బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేసినట్లు చెప్పారు. అయితే సునీత దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

దస్తగిరి బెయిల్ రద్దు కోరే అధికారం తనకు తప్ప ఇంకోళ్ళకు లేదని ఆమె వాదించారు. ఇక్కడే సునీత వైఖరి మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. తన తండ్రిని చంపిన హంతుకుడు కళ్ళెదుటే బయట హ్యాపీగా తిరుగుతున్నా అతని బెయిల్ రద్దు చేయకూడదని సునీత ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావటంలేదు. ఒకవైపు హంతకులకు శిక్షలు పడాలంటారు. ఇంకోవైపేమో దస్తగిరి బయట తిరుగుతుంటే పట్టించుకోవటంలేదు. ఇక్కడే సాక్షి కృష్ణారెడ్డిని సునీత అనుమానితుడని చెప్పి చివరకు నిందితుడిని చేస్తారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేశారు కాబట్టే కృష్ణారెడ్డి వెంట సునీత పడ్డారా అనే అనుమానాలూ పెరిగిపోతున్నాయి. మరి కోర్టు ఏం చెబుతుందో చూడాలి.

First Published:  4 July 2023 12:40 PM IST
Next Story