పవన్‌కు విశాఖ పోలీసుల నోటీసులు
బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్ అలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు మోపారు. ఈ మేరకు విశాఖ ఈస్ట్ ఏసీపీ పవన్ కల్యాణ్‌కు నోటీసులు అందించారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్ అలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
ఇక విశాఖలోని రుషికొండలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనపైనా పోలీసులు ఆంక్షలు విధించారు. సిటీలోని జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి కేవలం పవన్ వెహికిల్‌కు మాత్రమే పర్మిషన్ ఉందని చెప్పారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్ వెళ్లాలన్నారు. కావాలంటే పవన్ కల్యాణ్ గీతం యూనివర్సిటీ దగ్గర మీడియాతో మాట్లాడొచ్చని స్పష్టం చేశారు. అయితే పోలీసుల ఆంక్షలపై జనసైనికులు ఫైర్ అవుతున్నారు. దీంతో విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
వారాహి యాత్రలో భాగంగా గురువారం విశాఖకు చేరుకున్నారు పవన్‌కల్యాణ్. ఈనెల 19 వరకు ఆయన అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రుషికొండతో పాటు ఎర్రమట్టి దిబ్బలు, దసపల్లా భూములు.. తదితర ప్రాంతాలను పవన్ సందర్శించనున్నారు. స్టీల్‌ప్లాంట్ సమస్యపై వివిధ సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.