Telugu Global
Andhra Pradesh

ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదు.. అది మాక్ డ్రిల్

ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వ్యవహారం చివరకు రాజకీయ రంగు పులుముకోవడం విశేషం. చంద్రబాబు కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై వెటకారంగా ట్వీట్ చేశారు.

ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదు.. అది మాక్ డ్రిల్
X

విశాఖ బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ ఎల్లో మీడియా సృష్టించిన కథనాలన్నీ ఫేక్ అని తేలిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వహణలో భాగంగా జరిగిన మాక్ డ్రిల్ అది అని విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ (VMRDA) కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ర్పచారాన్ని ఆయన ఖండించారు.


ఎందుకిలా..?

ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన రెండోరోజే తెగిపోయిందంటూ నిన్నటి నుంచి ఎల్లో మీడియా కోడై కూస్తోంది. వాస్తవానికి ఈ ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. T ఆకారంలో ఉండే ఈ బ్రిడ్జ్ విడిపోవడంతో ఆక్కడున్న సందర్శకులు షాకయ్యారు. కొంతమంది ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అలల తాకిడి ఉధృతంగా ఉండటంతో అంతకు ముందే సందర్శకుల్ని నిర్వాహకులు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైపు అనుమతించలేదు. దీంతో బ్రిడ్జ్ నిజంగానే తెగిపోయిందనే ప్రచారం జరిగింది. అసలు విషయంపై VMRDA అధికారిక ప్రకటన విడుదల చేసింది. అది కేవలం మాక్ డ్రిల్ అని స్పష్టం చేసింది. "సముద్ర అలల తీవ్రత దృష్ట్యా రీత్యా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు “T” పాయింట్ (వ్యూ పాయింట్) ను బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించేందుకు.. ఏంకర్ లకు దగ్గరగా జరిపి నిలిపి ఉంచారు." అని అధికారికంగా ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మాక్ డ్రిల్స్ జరుగుతాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మాక్ డ్రిల్ కి సంబంధించిన వీడియోలను విడుదల చేశారు.


రాజకీయ రగడ..

ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వ్యవహారం చివరకు రాజకీయ రంగు పులుముకోవడం విశేషం. విశాఖపై బురదజల్లేందుకు రెడీగా ఉన్న పచ్చ బ్యాచ్ హడావిడి అంతా ఇంతా కాదు. ఆఖరికి చంద్రబాబు కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై వెటకారంగా ట్వీట్ చేశారు. ఫేక్ న్యూస్ ఆధారంగా ఫేక్ ట్వీట్ చేశారు బాబు.

నిజం గడపదాడేలోపు..

ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విషయంలో నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సంఘటన రుజువు చేసింది. నిజం గడపదాటేలోపే.. ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రపంచమంతా చుట్టేసింది. మాక్ డ్రిల్ విషయాన్ని ముందే ప్రకటించినా, కనీసం సందర్శకులకు చెప్పినా కూడా ఇంత హడావిడి జరిగేది కాదు.

First Published:  27 Feb 2024 10:09 AM IST
Next Story