Telugu Global
Andhra Pradesh

వైసీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు రాజీనామా

పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు పంచ‌క‌ర్ల‌కి అధిష్టానం నుంచి సానుకూల స్పంద‌న రాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్‌నే మ‌ళ్లీ బ‌రిలో దింపాల‌ని వైసీపీ అధిష్టానం యోచిస్తోంది.

వైసీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు రాజీనామా
X

మాజీ ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు.. పార్టీలు మార‌డంలో గంటా శ్రీనివాస‌రావుని మించిపోయారు. మాజీ మంత్రి గంటా గ్యాంగ్‌గా పేరుప‌డిన పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు ఐదేళ్ల‌కోసారి పార్టీ మార‌డం ఆన‌వాయితీగా పెట్టుకున్న‌ట్టు ఉంది. వైసీపీలో చేరి ఐదేళ్లు పూర్తి కావ‌డంతో మ‌రో పార్టీలోకి మ‌రోసారి జంప్ కొట్టేందుకు సిద్ధం అయ్యారు.

ప్ర‌స్తుతంలో వైసీపీ కీల‌క నేత అయిన పంచకర్ల రమేష్ బాబు విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ర‌మేష్‌బాబు వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. టికెట్ పోటీలో వెన‌క‌బ‌డిన పంచ‌క‌ర్ల‌, వైసీపీలో టికెట్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని తెలియ‌డంతో పార్టీ వీడుతున్నారు.

పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు పంచ‌క‌ర్ల‌కి అధిష్టానం నుంచి సానుకూల స్పంద‌న రాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్‌నే మ‌ళ్లీ బ‌రిలో దింపాల‌ని వైసీపీ అధిష్టానం యోచిస్తోంది. పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబుకి ప్ర‌స్తుతం ఆశ‌ప‌డ్డ పెందుర్తి ద‌క్క‌ద‌ని తేలిపోయింది. గ‌తంలో పోటీచేసిన య‌ల‌మంచిలి కూడా ఖాళీ లేదు. ఇక పార్టీ మార‌డం త‌ప్పించి గ‌త్యంత‌రం లేద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

2009లో ప్రజారాజ్యంలో చేరిన పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌రువాత 2014లో య‌లమంచిలి నియోజకవర్గ టీడీపీ నుంచి అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. 2019లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అధికార వైసీపీలో జాయిన్ అయి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. పెందుర్తి సీటుపై ఆశ‌ప‌డినా టికెట్‌ ద‌క్కేలా లేక‌పోవ‌డంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు.

First Published:  13 July 2023 10:55 AM IST
Next Story