Telugu Global
Andhra Pradesh

ధనిక సీఎంగా జగన్‌

373 కోట్ల రూపాయల ఆస్తులతో జగన్ ధనిక సీఎంగా మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 132 కోట్ల రూపాయలతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ రెండో స్థానంలో ఉన్నారు.

ధనిక సీఎంగా జగన్‌
X

దేశంలో అత్యంత ధనిక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అంటోంది వెట్‌ పత్రిక '' ది ప్రింట్''. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి ఏడు ఆసక్తికరమైన అంశాలను ప్రచురించింది.

373 కోట్ల రూపాయల ఆస్తులతో జగన్ ధనిక సీఎంగా మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 132 కోట్ల రూపాయలతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ రెండో స్థానంలో ఉన్నారు. ఒడిశా సీఎం 63 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. నాగాలాండ్ సీఎం నీపూ రియో రూ. 28 కోట్లు, చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌ 15 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆస్తుల విలువ 13.72కోట్లు. త్రిపుర సీఎం ఆస్తుల విలువ 11.28 కోట్లు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆస్తుల విలువ రూ. 7.18 కోట్లు.

ఇక మిగిలిన ముఖ్యమంత్రులంతా 10కోట్లకు లోపే ఆస్తులు కలిగి ఉన్నారు. ముఖ్యమంత్రుల్లో అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్న వ్యక్తిగా బెంగాల్ సీఎం మమత నిలిచారు. ఆమెకు కేవలం 15 లక్షల విలువైన ఆస్తి మాత్రమే ఉంది. ఉద్యమాల సమయంలో నమోదైన కేసు కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అత్యధికంగా 64 కేసులున్నాయి. జగన్‌పై 38 కేసులున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్‌పై ఎలాంటి కేసులు లేవు.

First Published:  29 Dec 2022 7:39 AM IST
Next Story