జనసేన సందడి షురూ.. వారాహి పోస్టర్ వచ్చేసింది
ముందుగా నాదెండ్ల మనోహర్ యాత్ర గురించి ప్రకటించారు, ఇప్పుడు పోస్టర్ విడుదల చేశారు. త్వరలో వారాహి పాటలు సిద్ధమవుతాయి, ఆ తర్వాత యాత్ర మొదలవుతుంది.
జూన్ 14నుంచి ఉభయగోదావరి ఉమ్మడి జిల్లాల్లో వారాహి యాత్ర అంటూ పవన్ కల్యాణ్ పోస్టర్ రిలీజ్ చేశారు జనసేన నాయకులు. ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా యాత్రకోసం ఇన్ చార్జ్ లను ఏర్పాటు చేశారు. వారి పర్యవేక్షణలో యాత్ర జరుగుతుంది. యాత్రలో వారాహి వాహనంపై ఎవరెవరుండాలి, ఎక్కడెక్కడ వాహనం ఆపి ప్రసంగించాలి అనే విషయాలపై కసరత్తు జరుగుతోంది.
సినిమా ప్రమోషన్ లాగానే..
పవన్ కల్యాణ్ కార్యక్రమాలన్నీ సినిమా ప్రమోషన్లను తలపిస్తుంటాయి. వారాహి వాహనం విషయంలో కూడా ముందు టీజర్లు వదిలినట్టు వాహనం ఫొటోలను బయటకు వదిలారు. ఆ తర్వాత వాహనంతో పవన్ కల్యాణ్ ఫొటోషూట్, చివరకు పూజా కార్యక్రమాల రోజు సినిమా రిలీజ్ చేసినంత హడావిడి చేశారు. ఇప్పుడు వారాహి యాత్ర సందర్భంగా కూడా అదే జరుగుతోంది. ముందుగా నాదెండ్ల మనోహర్ యాత్ర గురించి ప్రకటించారు, ఇప్పుడు పోస్టర్ విడుదల చేశారు. త్వరలో వారాహి పాటలు సిద్ధమవుతాయి, ఆ తర్వాత యాత్ర మొదలవుతుంది.
"వారాహి యాత్ర" పోస్టర్ ఆవిష్కరించిన శ్రీ @mnadendla గారు
— JanaSena Party (@JanaSenaParty) June 5, 2023
#JanaSenaVarahi#VarahiYatra pic.twitter.com/udqVdOZdF6
గోదావరి జిల్లాల్లోనే ఎందుకు..?
కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లోనే యాత్ర చేపట్టారనే విమర్శలు వినపడుతున్నాయి. అందులోనూ చంద్రబాబు చెప్పారు కాబట్టే ఆయన ఆ రెండు ఉమ్మడి జిల్లాలకు పరిమితం అవుతున్నారని కూడా అంటున్నారు. పవన్ యాత్ర ప్రారంభం అనగానే వైసీపీ నుంచి ఘాటుగా కౌంటర్లు పడ్డాయి. పవన్ కల్యాణ్ ది చంద్ర యాత్ర అని, అది వారాహి కాదు నారాహి అని అన్నారు నేతలు. ఇప్పుడు వారాహి రోడ్డెక్కిన తర్వాత, పవన్ నుంచి విమర్శలు మొదలైన తర్వాత వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.