పిఠాపురంలో మూడు రోజులు.. వారాహి షెడ్యూల్ వచ్చేసింది
సీఎం జగన్ బస్సు యాత్ర ఈనెల 27న ప్రారంభం అవుతుంది. అదే రోజు చంద్రబాబు ప్రజాగళం యాత్ర కూడా మొదలవుతుంది. ఆ తర్వాత మూడు రోజులకు పవన్ కూడా యాత్ర మొదలు పెడతారన్నమాట.

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తాజా షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 30నుంచి పిఠాపురం కేంద్రంగా వారాహి యాత్ర మొదలవుతుంది. తాను పోటీ చేస్తున్న పిఠాపురంకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు పవన్. మూడు రోజులపాటు అక్కడ వారాహి యాత్ర చేపడతారు. అనంతరం రాష్ట్ర పర్యటనకు బయలుదేరతారు. ఈ మూడురోజుల షెడ్యూల్ ని జనసేన అధికారికంగా ప్రకటించింది.
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 30 నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 30వ తేదీన నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు శ్రీపాద వల్లభుడుని దర్శించుకుంటారు. 31వ తేదీన ఉప్పాడ సెంటర్‌లో వారాహి యాత్ర ఉంటుంది. అక్కడ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. ఏప్రిల్ 1న పార్టీలో చేరికలు ఉంటాయి. అనంతరం నియోజకవర్గంలోని మేధావులతో పవన్ సమావేశం అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ మూడు రోజులూ పవన్ పిఠాపురంలోనే బస చేస్తారు.
సీఎం జగన్ బస్సు యాత్ర ఈనెల 27న ప్రారంభం అవుతుంది. అదే రోజు చంద్రబాబు ప్రజాగళం యాత్ర కూడా మొదలవుతుంది. ఆ తర్వాత మూడు రోజులకు పవన్ కూడా యాత్ర మొదలు పెడతారన్నమాట. మొత్తానికి మూడు పార్టీల అధ్యక్షుల యాత్రలతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరగబోతోంది. అయితే ఏ యాత్రకు ఎక్కువ ఫలితం లభిస్తుందో, ఎవరి యాత్ర సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.