జనసేనలోకి వంగవీటి ఖాయమేనా?
ఎన్నికల వేడి బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే కష్టమే అని రాధా డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాలని కూడా నిర్ణయించుకున్నారట. దీనికి ప్రదాన కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని గట్టిగా అనుకోవటమే.
వంగవీటి రాధాకృష్ణ అలియాస్ రాధా జనసేనలో చేరబోతున్నారా? జనసేనతో పాటు కొందరు కాపునేతల్లో కూడా ఇప్పుడిదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల వేడి బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే కష్టమే అని రాధా డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాలని కూడా నిర్ణయించుకున్నారట. దీనికి ప్రదాన కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని గట్టిగా అనుకోవటమే.
మొదటి నుండి రాధా దృష్టంతా సెంట్రల్ నియోజకవర్గం మీదే ఉంది. ఇక్కడి నుండి పోటీ చేసే అవకాశం దక్కలేదనే 2019 ఎన్నికల ముందు వైసీపీని కూడా వదిలేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా సెంట్రల్ నుండి పోటీకి టీడీపీలో అవకాశం రాదని తేలిపోయిందట. అందుకనే జనసేనలో చేరి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ, జనసేన మధ్య పొత్తుంటుందనే ప్రచారం నేపథ్యంలో జనసేన తరపున పోటీచేస్తే గెలుపు ఈజీ అని అంచనా వేస్తున్నారట.
మరిదే నియోజకవర్గంలో బోండా ఉమ టీడీపీ తరపున పోటీ చేశారు. రేపటి ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేయటం ఖాయం. పొత్తుంటే అప్పుడు చంద్రబాబునాయుడు ఏమిచేస్తారో చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాధా చేరికతో కాపుల ఓట్లన్నీ జనసేనకు పడతాయనే భ్రమలో అధినేత పవన్ కల్యాణ్ ఉన్నట్లున్నారు. అయితే రాధాకు అంత సీన్ లేదన్న విషయం పవన్‌కు తెలియదా? వంగవీటి రంగా కొడుకు హోదాలో రాధా నామినేషన్ వేస్తే గెలిచిపోయినట్లే అనేంత సీనుందా? నిజంగానే అంత సీనుంటే రాధా రెండుసార్లు ఎందుకు ఓడిపోతారు?
రంగాను చూసి కొడుకు రాధాకు కాపులే ఓట్లేయలేదని అర్థమవుతోంది. రాధాకే కాపులు ఓట్లేయలేదంటే ఇక జనసేనకు కాపుల ఓట్లు ఎందుకు పడతాయి? రంగా పేరుచెప్పుకుని ఓట్లు తెచ్చుకుందామంటే కుదరనిపని. రెగ్యులర్‌గా జనాల్లో ఉండే వాళ్ళకే ఓట్లుపడేది అనుమానం. అలాంటిది జనాల్లో పెద్దగా కనబడని రాధాకు ఓట్లు ఎలా పడతాయి? మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున రాధా ప్రచారం చేసినా బోండా ఓడిపోయారు కదా. మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజునో లేకపోతే 22 ఉగాది రోజు కానీ జనసేనలో చేరాలని డిసైడ్ అయ్యారట. చూద్దాం ఆ రోజు ఏమవుతుందో.