ఆ వార్తలు అవాస్తవమన్న టీటీడీ
తిరుమలలో నిష్కా బేగం అనే వ్యక్తి ప్రజా సంబంధాల అధికారిగా ఎప్పుడూ లేరన్న టీడీడీ
BY Raju Asari8 Jan 2025 11:40 AM IST
X
Raju Asari Updated On: 8 Jan 2025 11:43 AM IST
గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రజా సంబంధాల అధికారిణిగా నిష్కా బేగం అనే వ్యక్తి పనిచేసినట్లుగా.. ఆమె ఇంటిపై దాడులు చేసిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె ఇంట్లో నగలుస్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు నిజం కాదని పేర్కొన్నది.టీటీడీ లో నిష్కా బేగం అనే వ్యక్తి ప్రజా సంబంధాల అధికారిగా ఎప్పుడూ లేరు. గతంలో ఎక్కడో జరిగిన ఫొటోలను జతచేసి టీటీడీ పేరును వాడటాన్ని ఖండిస్తున్నాం. భక్తులను తప్పుదోవ పట్టించి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
Next Story