Telugu Global
Andhra Pradesh

కోర్టులపైనే బురద చల్లేస్తోందా?

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అవటాన్ని ఎల్లోమీడియా యాజమాన్యాలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్‌కావ‌డం వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతుందని టెన్షన్ పడుతున్నట్లుంది.

కోర్టులపైనే బురద చల్లేస్తోందా?
X

ఎల్లోమీడియా పూర్తిగా బరితెగించినట్లే కనిపిస్తోంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అవటాన్ని ఎల్లోమీడియా యాజమాన్యాలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్‌కావ‌డం వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతుందని టెన్షన్ పడుతున్నట్లుంది. అందుకనే చంద్రబాబుది అక్రమ అరెస్టు, అన్యాయం అంటు ప్రతిరోజు పేజీలకు పేజీలు కథనాలు, వార్తలు వండివారుస్తోంది. చంద్రబాబు అరెస్టు అక్రమం అని తమ కోణంలో ఎన్ని కథనాలు, వార్తలు రాసుకున్నా ఎవరికీ నష్టంలేదు. అయితే అంతటితో ఆగకుండా న్యాయ వ్యవస్థ‌ మీద కూడా బురదచల్లేస్తోంది.

చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ శాఖ ఎక్కడా నిరూపించలేకపోయిందట. స్కిల్ స్కామ్‌లో దర్యాప్తు చేస్తున్నది సీఐడీ అయితే విజిలెన్స్ శాఖ ఎక్కడ నుండి వచ్చింది? కేంద్ర దర్యాప్తు సంస్థ‌లు జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఈడీ, ఐటీ శాఖలు కూడా స్కిల్ స్కామ్‌పై అవినీతి జరిగిందని రూ.247 కోట్లు షెల్ కంపెనీలకు తరలిపోయిందని నిర్ధారించాయి. ఇవేవీ ఎల్లోమీడియాకు చంద్రబాబు అవినీతికి ఆధరాలుగా కనబడటంలేదు. న్యాయ వ్యవస్థ‌ను జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నారట.

రెండువారాలైనా చంద్రబాబుకు ఊరట లభించలేదని గోల చేస్తోంది. చంద్రబాబు వాదనలను కోర్టులు కొట్టేసిందంటే ఆయన అవినీతికి ప్రాథ‌మిక ఆధారాలున్నట్లే కదా. వివేకా మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్‌ను కాపాడ‌టంలో జగన్ మేనేజ్మెంట్ స్కిల్ బయటపడిందట. అంటే కోర్టులను జగన్ మేనేజ్ చేస్తున్నారని ఎల్లోమీడియా బురదచల్లేస్తోందని అర్థ‌మవుతోంది. చంద్రబాబు అవినీతికి ఆధారాలు లేకపోయినా కోర్టులు రిమాండు విధించిందన్నట్లుగా కథనాలు అచ్చేసింది.

అంటే ఎల్లోమీడియా చెప్పిందేమిటంటే జగన్+కోర్టులు కుమ్మక్కై చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిందని. వ్యవస్థ‌లను చంద్రబాబు కన్నా మేనేజ్ చేయగలిగినవాళ్ళు ఇంకెవరూ లేరని జగన్, మంత్రులు ఒకవైపు చాలాకాలంగా ఆరోపణలు చేస్తునే ఉన్నారు. దానికి కౌంటరుగానే ఎల్లోమీడియా ఇప్పుడు కోర్టులను జగన్ మేనేజ్ చేస్తున్నారంటు బురదచల్లేస్తోంది. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్‌ను అరెస్టు కాకుండా చూడటంలోనే జగన్ కెపాసిటి బయటపడిందని బురదచల్లేస్తోంది. చంద్రబాబును అరెస్టు చేయటంలో ఏసీబీ కోర్టు, క్వాష్ పిటీషన్ కొట్టేయటాన్ని కూడా ఎల్లోమీడియా తప్పుపడుతుండటమే ఆశ్చర్యం.


First Published:  24 Sept 2023 11:02 AM IST
Next Story